- క్రీడారంగంలో కులవివక్ష బయటపెట్టిన సురేష్ రైనా
- మద్దతుగా నిలిచినా రవీంద్ర జడేజా
మన దేశంలో క్రీడా రంగానికి రంగు, రుచి , కులము , మతము వంటివి ఏమి వుండవని అంటూ వుంటారు. ఎందుకంటే క్రీడారంగం అనేది క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఉంటుందనేది. విదేశాల్లో అయితే ఎవరైనా క్రీడాకారులు వేరే ఎవరిపైన అయినా వివక్ష చూపితే దానికి సంభందించిన కంట్రోల్ బోర్డు సభ్యులు వారిపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం మనం చూసి ఉంటాము.
ఆ మధ్య ఇంగ్లాండ్ కు చెందిన క్రికెటర్ ఒకరు ఇటువంటి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు బోర్డు ఆయనమీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వెంటనే అతను క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదే సమయంలో భారతదేశ క్రికెట్ రంగంలో కులతత్వం పై కూడా చాలానే విమర్శలు గత కొంత కాలంగా వస్తూనే ఉన్నాయి. వస్తున్నా కూడా అవి పెద్దగా బహిరంగ చర్చకు దారితీయలేదు. ( ధోనీ బాటలో సురేష్ రైనా.. )
భారత క్రికెట్ పై చాలానే విమర్శలు
కానీ క్రికెట్ లో కులతత్వం ఎంతలా ఉందొ అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో వినోద్ కాంబ్లీ ఎంతో ప్రతిభతో కూడిన ఆటను కనబర్చి ప్రపంచ క్రికెట్ లో రికార్డ్స్ క్రియేట్ చేసినా కూడా వివక్షతో కూడిన రాజకీయాల వలన తాను ఎలా క్రికెట్ కి దూరమయ్యాడో చూసాం. ఆ సమయంలో దానిపై విమర్శలు వచ్చినా.. దానిని ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు.
ఇప్పడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తాజాగా భారత క్రికెటర్ సురేష్ రైనా ఇటువంటి వివక్షతో కూడిన వ్యాఖ్యలే చేసి మళ్ళీ చర్చకు దారితీసాడు. తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అన్న విషయం మర్చిపోయి ఒక కుల అహంకారంతో తన కులతత్వాన్ని బయటపెట్టాడు. సురేష్ రైనా భారత క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఐపీల్ IPL లో చెన్నై తరపున ఆడుతున్న వ్యక్తి.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
అయితే తమిళనాడుకు సంభందించి జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ TPL లో సురేష్ రైనా ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. ఆ సందర్భంలో పక్కనే ఉన్న మరో వ్యాఖ్యాత సురేష్ రైనా తో మాట్లాడుతూ ” ఇన్ని సంవత్సరాలుగా మీరు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నారు కదా.. తమిళ సంస్కృతి గురించి ఏమి తెలుసు .. మీరు ఏమి నేర్చుకున్నారు” అని అడిగాడు.
అందుకు సురేష్ రైనా సమాధానంగా ” నేను ఉత్తర భారత్ దేశానికి చెందిన బ్రాహ్మణున్ని .. అయినా కూడా దక్షిణ భారత దేశం తమిళనాడులోని బ్రాహ్మణ సంసృతిని బాగానే అర్ధం చేసుకున్నాను. ఇక్కడి బ్రాహ్మణ సంసృతిని నేర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ లోని మా బ్రాహ్మణ ఆటగాళ్ళైన అనిరుద్ శ్రీకాంత్, బద్రీనాథ్, లక్ష్మిపతి బాలాజీ కూడా బాగా సహకరించారు. అలాగే బ్రాహ్మణులమైన మేము మంచి పరిపాలనా దక్షత కలిగిన వాళ్ళము. బ్రాహ్మణులమైన మాకు అద్భుతాలు సృష్టించే సామర్ధ్యం పుట్టుకతోనే వస్తుంది. అలంటి యాజమాన్యం కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడటమనేది నేను చేసుకున్న అదృష్టం. నాలో ఓపిక వున్నంతవరకు చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తాను” అన్నారు.
సురేష్ రైనా ప్రాతినిధ్యం వహిస్తుంది క్రికెట్ కా.. కులానికా..
మన దేశంలో క్రికెట్ ని ఏంతో మంది యువకులు ఆరాధిస్తుంటారు.. అభిమానిస్తుంటారు. అలాంటి భారతదేశ క్రికెట్ కి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఫీలవ్వాల్సిన ఒక క్రికెటర్ .. క్రికెట్ ను ఆరాధించే యువకులకు ప్రేరణగా నిలవాల్సింకిది పోయి , ఇలా కుల వివక్షతో కూడిన అహంకారపు మాటలు మాట్లాడితే.. అభిమానించడం సంగతి అటుంచితే అసహ్యించుకుంటారు.
ఒక బాధ్యతతో కూడిన క్రికెటర్ దేశం ముందుకు వెళ్ళే దిశగా తన మాటలు, చర్యలు ఉండాలి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోనే కాకుండా దేశం మొత్తంగా చాల విమర్శలు మొదలయ్యాయి. ఒకవైపు ఇంతలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరో క్రికెటర్ రవీంద్ర జడేజా ట్వీట్ రూపంలో సురేష్ రైనాకు మద్దతుగా నిలిచాడు. గత కొన్నేళ్లుగా మన దేశ క్రికెట్ లో కుల ప్రాతిపదికన ఎన్నుకోవడం.. వారికే అవకాశాలు ఇవ్వడం ఇవన్నీ చూస్తూనే వున్నాం. కానీ ఎప్పుడు ఇలా బహిరంగ పరచడం కానీ , ఇలా పబ్లిక్ గా వ్యాఖ్యలు చేయడం గానీ జరగలేదు.
ఇంత దారుణంగా ఒక కులాన్ని ప్రోత్సహించుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రాబోయే తరం యువకులకు క్రీడారంగంపై ఎటువంటి ఉద్దేశాలు కలుగుతాయో అవి ఎప్పటికీ గర్వించ దగ్గ విషయం కాదు. ఒక ఆటగాడిని ఆటగాడిగా చూసినప్పుడే ఆ రంగంపై సరైన గౌరవం.. దానికి ప్రాముఖ్యత లభిస్తుంది.