నా కెరియర్ లో ఇలాంటి ఉత్తర్వులు చూడలేదు.. జస్టిస్ బాబ్డే .. !!

ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందా లేదా అన్న దానిపై తేలుస్తామని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

రాకేష్ కుమార్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తమను దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఉత్తర్వులను ఇప్పటి వరకూ తాము చూడలేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం విచ్చిన్నంపై తెలుస్తామంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తమను ఆందోళన కలిగిస్తున్నాయని.. దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వకూడదని న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించగా.. ఇలాంటి ఉత్తర్వులను మీరు గతంలో ఎన్నడైన చూశారా అని ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదిని ప్రశ్నించారు. మీరు ఎంత కాలం నుండి సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు, అసలు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూశారా అని సుప్రీంకోర్టు నిలదీసింది.

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందని సదరు న్యాయమూర్తి ఎందుకు భావించారో అర్థం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆందోళన కలిగించేలా ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వ్యవస్థలేమీ కుప్పకూలిపోలేదు కదా అని ప్రశ్నించారు.

అసలు రాజ్యాంగం విచ్ఛిన్నంపై తేల్చేందుకు హైకోర్టు ఉన్న పరిధి పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

Leave a Comment