మా నివేదికను బయటపెట్టండి.. సుప్రీమ్ కోర్ట్ ప్యానెల్ మెంబెర్ Anil J Ghanwat

Anil J Ghanwat సుప్రీమ్ కోర్ట్ ప్యానెల్ మెంబెర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాయి. ఎండనకా.. వాననకా.. కరోనాకు భయపడకుండా వారు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఆగష్టు 28వ తేదీ జరిగిన రైతుల ధర్నాలో లాఠీ ఛార్జ్ కారణంగా రైతుల తలలు పగిలి రక్తాలు కారుతున్న సంఘటనలు దేశంలో రైతులను ప్రేమించే వాళ్ళ కంట కన్నీరు తెప్పించాయి. దీనికి నిరసనగా వారు హర్యానాలోని ఒక జిల్లాలో ఒక భారీ నిరసన రాలీకి సిద్ధపడుతున్నారు. ( బెంగాల్ విభజన రాగం..! )

మరోవైపు ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది. ఎక్కడ చూసినా 144సెక్షన్ విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. ఇంటర్నెట్ నిలిపివేశారు. అదంతా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఆ నిరసన ర్యాలీని విరమించుకోవాలని అక్కడి ప్రభుత్వం పిలుపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకునేది లేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. వారి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే రైతు సంఘాల నాయకుల డిమాండ్ ఒక్కటే.. రైతుల తలలు పగులగొట్టిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వాలు మాత్రం దానికి సిద్ధంగా లేవు. దీంతో ఆ చర్చలు కూడా విఫలమయ్యాయి.

ఇదిలా ఉండగా మరోవైపు ఎప్పటినుంచో ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. అప్పుడు సుప్రీం కోర్టు ధర్మాసనం ఏం చేసింది అంటే.. దీనికి సంబంధించిన రైతులతో, రైతు సంఘాల నాయకులు, ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కీలకమైన సూచనలు.. సలహాలు ఇవ్వమని ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ ను ఈ ఏడాది జనవరి 12వ తేదీన నియమించింది. Anil J Ghanwat, Dr.Pramod Kumar Joshi, Dr. Ashok Gulati ఈ ముగ్గురు సభ్యులతో ఒక ప్యానెల్ ను నియమించింది. ( కరోనా మూడవ వేవ్  )

ఈ ముగ్గురు సభ్యులు 85 రైతు సంఘాలతూను.. రైతు నాయకులతో మాట్లాడారు. ఇంకా చాలా మందితో సంప్రదింపులు జరిపారు. అనంతరం రైతులు వారి నిరసన విరమించాలి అన్న.. వీళ్ళ సమస్యలు పరిష్కారం ఇవ్వాలి అన్న.. వీళ్లకు ప్రయోజనాలు కలగాలి అన్నా .. ఏం చేయాలో చెప్తూ ఒక నివేదికను తయారు చేసి మార్చి 19వ తేదీన సుప్రీం కోర్టుకు అందజేశారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది. ఆ నివేదిక ఎక్కడవుందో తెలియని పరిస్థితి. ఇంకా రైతుల నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. వారి తలలు పగులుతూనే వున్నాయి. దాంతో వీరు మరో భారీ నిరసనకు పిలుపునిచ్చారు.

సుప్రీమ్ కోర్ట్ ప్యానెల్ మెంబెర్ ఆవేదనతో లేఖ

దీంతో వీటన్నిటినీ చూసి కలత చెందిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ లో ఒకరైన Anil J Ghanwat సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారికి ఒక ఘాటైన లేఖ రాశారు. అందులో రైతులు నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వారి తలలు పగలగొడుతూనే ఉన్నారు. వాళ్ళను చూస్తుంటే ఒక రైతు బిడ్డగా.. ప్యానెల్ కమిటీ సభ్యుడిగా నా గుండె తరుక్కుపోతుంది. మీరు ముగ్గురు సభ్యుల ఒక ప్యానెల్ కమిటీని నియమించారు. మేము ఒక నేవైదికను కూడా అందించాము. ఇచ్చి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది. ఆ నివేదికలో వాళ్లకు ప్రయోజనం కలిగే విధంగా చాలా సూచనలు, సలహాలు ఇచ్చాము. కానీ ఆ నివేదికను మీరెందుకు బయట పెట్టడం లేదు.

ఆ నివేదికలో ఏముందో తెలుసుకునే హక్కు ప్రజలందరికీ ఉంది కదా. మరి మీ హక్కును ఎందుకు సుప్రీంకోర్టు తొక్కి పెడుతోంది అని ఘాటైన పదజాలం వాడారు. అక్కడితో ఆగకుండా సుప్రీం కోర్టు కనీసం మేము ఇచ్చిన నివేదిక మీద ధ్యాస కూడా పెట్టినట్లు నాకు అనిపించలేదు. మరి ధ్యాస కూడా పెట్టకపోతే మమ్మల్ని ప్యానల్ కమిటీగా ఎందుకు వేశారు. మేము ఇచ్చిన నివేదిక పక్కన కోల్డ్ స్టోరేజ్ లో పడేసినట్లు అనిపిస్తోంది నాకు. ఇవన్నీ కూడా నా మనసును కలచి వేస్తున్నాయి. ఇప్పటికైనా మేం ఇచ్చిన నివేదికను బహిరంగ పంచండి. ఆ నివేదికను ప్రజలకు తెలియజేయండి.

మేము ఇచ్చిన నివేదికలో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. రైతుల నిరసనలు, ర్యాలీలు ఆగిపివాలంటే దానికి చాలా సూచనలు, సలహాలు చేసాము. అది కూడా రైతులు అంగీకరించవచ్చు. మరి ఇప్పటికైనా దానిని బహిర్గతం చెయ్యండి అని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ గారికి లేఖ రాశారు కమిటీ సభ్యుడు. మరి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆ నివేదికను దేశ ప్రజల ముందు ఉంచుతుందో.. రైతులకు ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒక అడుగైనా ముందుకు పడుతుందో చూడాలి.

1 thought on “మా నివేదికను బయటపెట్టండి.. సుప్రీమ్ కోర్ట్ ప్యానెల్ మెంబెర్ Anil J Ghanwat”

Leave a Comment