బెయిల్ కావాలంటే ఇలా చేయండి : మన దేశంలో జరుగుతున్నంతగా ఆహార కల్తీ మరే ఇతర దేశాల్లో కూడా లేదనేది అధికారిక నివేదికలు చుస్తే అర్ధమవుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారం పూర్తిగా కల్తీ మయం అయిపొయింది.
దీనికి సంబంధించి అధికారులు ఆహార నిల్వల నిర్వాహకులపై దాడులు నిర్వహించడం.. కల్తీ చేసే వారిపై కేసులు పెట్టడం సాధారణ విషయంగా మారిపోయింది. అయినా కూడా దీనిని అరికట్టడానికి ఏ వ్యవస్థలు సరైన పరిష్కార మార్గం చూపలేక పోతున్నాయి అనడంలో సందేహం లేదు.
తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆహారాన్ని కల్తీ చేస్తూ.. పెద్ద దందా కొనసాగిస్తూ.. మాఫియాలాగా తయారైనారన్న ఆరోపణల కారణంగా వారిపై కేసులు పెట్టింది అక్కడి ప్రభుత్వం. దాంతో ఆ అన్నదమ్ములు పోలీసులకు దొరకకుండా తిరుగుతూ.. తమను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో వారితరఫున లాయర్ సుప్రీమ్ కోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆహారంగా కల్తీ జరిగిన కేసులో బెయిల్ ఇవ్వచ్చు కనుక నా క్లయిన్ట్స్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయగలరు అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసును విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాయి.
ఆహార కల్తీ ఒక పెద్ద సమస్యే
మన దేశంలో ఆహార కల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. ఈ ఆహార కల్తీ జరగకుండా చూడాలన్న ద్యాస ఏ వ్యవస్థలకూ లేకుండాపోయింది. మీరేమో ఇదొక సమస్యే కాదు బెయిల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సరే బెయిల్ మంజూరు చేస్తాం. కానీ ఏదైతే ఆహరం కల్తీ జరిగిందన్న ఆరోపణ ఉందో .. ఆ ఆహారాన్ని మీరు కానీ ,మీ కుటుంబ సభ్యులు కానీ మా ముందు తినండి. తిన్న తర్వాత కూడా ఆ కల్తీ ఆహార పదార్ధాలు తినడం వలన ఏమీ అవలేదు అని మీరు భావిస్తే .. మళ్ళీ మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
దీంతో ఆ పిటిషన్ వేసిన లాయర్ మౌనంగా ఉండిపోయారు. వెంటనే ఆ లాయర్ ఆ పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కనీసం ఇలాంటి సున్నితమైన అంశాల్లోనైనా న్యాయస్థానాలు ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయడం శుభపరిణామం.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …