పవిత్ర స్నానాలతో పుణ్యం మాట దేవుడెరుగు.. వైరస్ అంటుకుని కరోనా బారిన పడుతున్నారు భక్తులు. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొంటున్న వారు కోవిడ్ బాధితులుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా కుంభమేళాలో పాల్గొన్న నిర్వాణి అఖాడాకు చెందిన మహామండలేశ్వర్ కపిల్ దేవ్ ను కరోనా కబళించింది. మధ్యప్రదేశ్ కు చెందిన కపిల్ కుంభమేళాలో పాల్గొనేందుకు హరిద్వార్ కి వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో డెహ్రాడూన్లోని కైలాష్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన మృతిచెందారు.
హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాలో రోజూ లక్షల సంఖ్యలో భక్తులు గంగాస్నానం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇప్పటివరకు జరిగిన మూడు షాహీ స్థానాల సమయంలో ఒక్క రోజులో కనీసం 20 లక్షల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు.
కుంభమేళాలో ఈ నెలలో మరో ముఖ్యమైన తేదీ అయిన 27న చైత్ర పౌర్ణమి సందర్భంగా షాహీ స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 30 వరకు జరగనున్న కుంభమేళాను రెండు వారాల ముందుగానే ముగిస్తారని జరిగిన ప్రచారం పై ప్రభుత్వం, మత పెద్దల మధ్య చర్చలు జరిగాయి. మహా కుంభమేళ కార్యక్రమం రద్దుకు సాధువులు అంగీకరించడం లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కుంభమేళాను మార్కజ్ తో పోల్చవద్దని చేసిన వ్యాఖ్య పెద్దఎత్తున దుమారానికి కారణమైంది. సంక్రమణ వేగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్కువమంది ఒకే ప్రాంతంలో గుమికూడరాదని చెబుతున్నప్పటికీ.. దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో జరుగుతున్న మహాకుంభమేళలోని పరిస్థితులు అందరినీ భయపెడుతున్నాయి.
కుంభమేళా సాధారణంగా జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ తో ఏప్రిల్ లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నప్పటికీ అత్యధిక శాతం మంది ప్రజలు పట్టించుకోవడం లేదు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్న మహాకుంభమేళాలో కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయి. దీంతో కుంభమేళ సూపర్ స్ప్రెడర్ గా మారిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాఖండ్ కోవిడ్ స్టేట్ కంట్రోల్ రూమ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 10 నుంచి 14వ తేదీ వరకూ హరిద్వార్లో పరీక్షలు చేయించుకున్న వారిలో 2167 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేసులు పెరుగుతున్నా కుంభమేళా కొనసాగించాల్సిందే అని 13 అఖాడాలకు చెందిన సాధువులు నిర్ణయించారు. అయితే కొద్దిమంది మాత్రమే షాహీ స్నానాల కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నారు. ఇటు ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కుంభమేళాలో పాల్గొనే వారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. ఇటువంటి పరిస్థితుల్లో కుంభమేళాను కొనసాగించటమా.. ముగించడమా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …