Sunstroke : గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల వేడి దంచి కొడుతోంది. మరో రెండు రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే వడగాల్పుల వలన ప్రాణాలు కూడా పోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో బయట తిరగడం అంత సేఫ్ కాదు. కావున పిల్లలు, పెద్దలు అందరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి.
ప్రస్తుతం కరోనా ప్రభావం కూడా అధికంగా వుంది కనుక వీలైనంత వరకు ఇంట్లో ఉండేందుకు ప్రయత్నించండి. ఈ వడగాల్పుల ప్రభావం ఇళ్లల్లో ఉండేవారి మీద కూడా చూపుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలను పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఈ సూచనలు పాటించండి.
Sunstroke తగలకుండా ఉండాలంటే
ఎండలోకి వెళ్లేప్పుడు కాటన్ లేదా పలుచటి దుస్తులు మరియు లైట్ కలర్ దుస్తులతో చేతులను పూర్తిగా కప్పి ఉంచే విధంగా ధరించాలి. వడగాల్పులు తగలకుండా చెవులకు రుమాలు మరియు క్యాప్ పెట్టుకోండి. బైక్ మీద వెళ్తే హెల్మెట్ ఎలాగో తప్పనిసరి.
వేడి గాలులవల్ల వల్ల శరీరం, గొంతు పొడిబారుతున్నట్లు అవుతుంది. కావున వీలైనంత వరకు ఎక్కువ నీరు త్రాగాలి. శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా త్రాగటం మంచిది. రోజుకు కనీసం నాలుగు నుండి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. ( ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డుపడుతున్నది ఎవరు..? )
వడగాల్పులు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు తలుపులు మూసేయండి. సూర్య కిరణాలు నేరుగా ఇంట్లోకి రాకుండా డోరు కర్టెన్లు వేసి ఉంచండి. సీలింగ్ ఫ్యాన్ కన్నా టేబుల్ ఫ్యాన్ ఉంటే బెటర్. వడగాల్పుల్లో బయటకు వెళ్ళేప్పుడు ఒక వాటర్ బాటిల్‌ను కూడా వెంట తీసుకెళ్లండి. గది చుట్టూ చల్లటి పరదా వేలాడదీయడం వల్ల ఇంటిని కాస్త చల్లగా ఉంచుకోవచ్చు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో బయటకి పంపకూడదు.
ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి. చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం 4 లేదా 5 సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి.
ఆహార విషయంలో
వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. కనుక నిల్వవుంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. దీని వలన ఇతర జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వడదెబ్బ తగిలి వాంతులు, తల తిరగడం వంటివి ఏర్పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …