ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా మరో కొత్త చిత్రం త్వరలో రాబోతోంది. సునీల్ మొత్తం 177 సినిమాల్లో కమెడియన్‌గా నటించి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన కామెడీతో అందరినీ మెప్పించారు.
మొదటిసారిగా సునీల్ 2006లో హీరోగా ఆరంగేట్రం చేశారు. అందాల రాముడు సినిమాతో సినీహీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో తన నటనతో కేవలం హాస్యం మాత్రమే కాదు.. హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. డ్యాన్స్, ఫైట్లలో పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తన నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారు.
మొదటిసారి హీరోగా నటించిన అందాల రాముడు సినిమా మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆయన పూలరంగడు, జక్కన్న, కృష్ణాష్టమి, టూ కంట్రీస్, భీమవరం బుల్లోడు, ఉంగరాల రాంబాబు, వీడు గోల్డ్ అహే సినిమాల్లోనూ హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల రీత్యా అతడికి హీరో పాత్రలు రాలేదు. కమెడియన్ పాత్రల విషయంలో కూడా బాగానే గ్యాప్ వచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాతో హీరోగా రాబోతున్నారు సునీల్. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందిస్తూ సమర్పిస్తున్న సినిమా ’వేదాంతం రాఘవయ్య‘. అలనాటి సినీ ప్రముఖుడు వేదాంత రాఘవయ్య పేరుతో వస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు సునీల్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, మాటలను హరీష్ శంకర్ అందిస్తున్నారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా దర్శకుడితో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని హరీష్ శంకర్ తెలిపారు.
అయితే వేదాంత రాఘవయ్య జీవిత కథతో ఈ సినిమాను నిర్మిస్తున్నారా.. లేక ఆయన పేరు మాత్రమే వాడుకుంటున్నారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి సునీల్ మరో సినిమాతో హీరోగా మనలను అలరించబోతున్నారన్నమాట.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …