బాలీవుడ్ పై కన్నేసిన సుబ్రమణ్య స్వామి..

Subramanyam

రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి గురించి మీకు తెలుసుగా. . తను ఏ విషయంలో అయినా అన్యాయం జరిగింది అనిపిస్తే వెంటనే దానిపై ద్రుష్టి సారిస్తాడు. కోర్టుల్లో కేసులు కూడా వేస్తాడు. అది పరిష్కారం అయ్యేవరకు విడిచి పెట్టాడు. అలాంటిది ఈసారి తాజాగా బాలీవుడ్ పై కన్నేశాడు.

హీరో సుశాంత్ మరణానికి సంభందించి తనదైన శైలిలో స్పందించాడు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఆత్మహత్య కాదు హత్యే జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీమ్ కోర్టును కోరగా , కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ మొదలు పెట్టి తనకు సంభందించిన బంధువులను, స్నేహితులను మరియు ఇంటి పని మనుషులను కూడా విచారిస్తోంది. ( సిడబ్ల్యూసి సమావేశం )

విచారణ కొనసాగుతున్న ఈ సమయంలో సుబ్రమణ్య స్వామి తనకు తెలిసిన కొన్ని విషయాలను బయటపెట్టాడు. సుశాంత్ మరణానికి ముందు తను ఒక డ్రగ్ డీలర్ ను సంప్రదించినట్టు, తరువాతనే తాను చనిపోయినట్టు , దుబాయ్ డ్రగ్ మాఫియాకు అక్కడి దాదాలకు ఈ మరణంతో సంభందం ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. వీటికి తను సరైన ఆధారాలు చూపనప్పటికీ , సుశాంత్ మరణం శ్రీదేవి, సునంద పుష్కరే మరణాలకు పోలిక ఉందనీ, దీని వెనుక డ్రగ్ మాఫియా హస్తముందని చెబుతున్నారు. కానీ శ్రీదేవి, సునంద పుష్కరే లవి సహజ మరణాలుగా విచారణ సంస్థలు ఇప్పటికే పొర్కనడం విశేషం.

Leave a Comment