- ముందు జాగ్రత్తగా ఉత్తర ప్రదేశ్ లో పిల్లలకు మెడిసిన్ కిట్లు పంపిణీ ప్రారంభం.
- దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు.
కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ తగ్గుముఖం పట్టడంతో, భారతదేశంలోని పలు రాష్ట్రాలు పిల్లలను రక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించడం ప్రారంభించాయి. కరోనా మూడవ వేవ్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులను గుర్తించి వారికి ముందుగా టీకాలు వేయాలని యోచిస్తోంది. జూన్ 15 నుండి, రాష్ట్ర ప్రభుత్వం తన గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికుల ద్వారా పిల్లలకు దగ్గు సిరప్ మరియు చిన్న మాత్రలతో కూడిన ఉచిత మెడిసిన్ వస్తు సామగ్రిని పంపిణీ చేయడం ప్రారంభించింది.
జార్ఖండ్ ప్రభుత్వం మూడవ వేవ్ సమయంలో తీసుకోవాల్సిన చికిత్సా ప్రణాళికలు మరియు పిల్లల నిర్వహణ గురించి వివరించే మాన్యువల్‌ను సిద్ధం చేయడంతో పాటు వారికి 6,000 పడకలు అవసరమని అంచనా వేసింది. ఈ సంవత్సరం మార్చి మరియు ఏప్రిల్ మధ్య మొత్తం కేసులలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 5% మాత్రమే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కనీసం 14 లక్షల మంది పిల్లలు మూడవ వేవ్ లో కోవిడ్ -19 బారిన పడే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. ( మంకీపాక్స్ రూపంలో )
కర్ణాటక ప్రభుత్వం జిల్లాల వారీగా పిల్లలకు అదనపు కేర్ సెంటర్స్ , కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పర్యవేక్షణకు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
శాస్త్రీయ ఆధారాలు ఏమిటి?
ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ?
మూడవ వేవ్ పిల్లలను అసమానంగా ప్రభావితం చేస్తుందని శాస్త్రీయ లేదా ఎపిడెమియోలాజికల్ ఆధారాలు లేవని ఎపిడెమియాలజిస్ట్ వైద్యులు మరియు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. లాన్సెట్ నివేదిక ప్రకారం భారతదేశ కమిషన్ టాస్క్ ఫోర్స్ కూడా అదే నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొంది. కోవిడ్ -19 బారిన పడిన చాలా మంది పిల్లలు తక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్లు కలిగివున్నట్టు నివేదిక పేర్కొంది.
మూడవ వేవ్.. పిల్లలపై ప్రభావం..
” కరోనా మూడో వేవ్ కు సిద్ధం కావాలి” అంటూ కార్డియాక్ సర్జన్ మరియు కర్ణాటక యొక్క కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ దేవి శెట్టి తన సంపాదకీయంలో రచించినట్టు మే 12 న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. తన సంపాదకీయంలో ” టీకాలు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అనుమతించబడుతున్నందున, పిల్లలపై ప్రధానంగా దాడి చేసే అవకాశం ఉందని అందువలన తల్లిదండ్రులకు త్వరగా టీకాలు వేయమని” అధికారులను కోరారు.
“మొదటి వేవ్ సమయంలో, కరోనా ప్రధానంగా వృద్ధులపై దాడి చేసిందని.. ఇప్పుడు రెండవ వేవ్ లో పెద్ద సంఖ్యలో యువకులపై దాడి చేస్తోందని ఆయన రాశారు. చాలా మంది పెద్దలు ఇప్పటికే వ్యాధి నుంచి బయటపడి రోగనిరోధక శక్తితో ఉన్నారు కనుక మూడవ వేవ్ లో పిల్లలపై దాడి చేసే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు. ఐసియు యూనిట్లలో పెద్దలతో పాటు పిల్లలు మరియు శిశువులకు చికిత్స చేయడం భిన్నంగా ఉంటుందని ఆయన వాదించారు. అందువలన పిల్లల సంరక్షణకు 1.65 లక్షల పీడియాట్రిక్ ఐసియు పడకలు అవసరం అని ఆయన పేర్కొన్నారు.
తన సంపాదకీయం రాసిన కొన్ని రోజుల తరువాత, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మే 22 న ఒక ప్రకటన విడుదల చేసింది, మూడవ వేవ్ పిల్లలను ప్రత్యేకంగా ప్రభావితం చేసే అవకాశం లేదని.. వ్యాధి పెరుగుదల తీవ్రత సంఖ్య ఎక్కువగా ఉన్నపటికీ, పిల్లలలో చాలా తక్కువ శాతం ఉంటుందని పేర్కొంది.
1 thought on “కరోనా మూడవ వేవ్ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని రాష్ట్రాలు జాగ్రత్త పడుతున్నాయా ?”