శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ లో ప్రమాదం.. కారణం ఇదేనా.. !!

Srisaila Fire

ఈమధ్యన శ్రీశైలం జల విధ్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి విధుల్లో వున్న 17 మంది సిబ్బందిలో 9 మంది సొరంగంలోనే దట్టమైన పొగ కారణంగా ప్రాణాలు విడిచారు. మిగతా వారు గాయాలతో బయటపడి ఇప్పటికీ జెన్కో ఆసుపత్రిలోనే చికిత్చ పొందుతున్నారు.

ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం CID విచారణకు ఆదేశించింది. విచారణ కూడా మొదలైంది. అయితే ఈ ప్రమాదంపై ప్రముఖ వార్త సంస్థ BBC విశ్లేషణ చేసింది. శ్రీశైలంలో ప్రాజెక్ట్ కి మునుపటికంటే భారీగా వరదనీరు చేరుతుంది.

ఈ వరద నీటిని ఎక్కువ మొత్తంలో వాడుకుని లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో పనిచేసినట్టు విశ్లేషించింది. గతంలో కంటే ఎక్కువ విధ్యుత్ ఉత్పత్తి చేయాలనుకోవడమే ప్రమాదానికి కారణంగా చెప్పుతున్నారు. శ్రీశైలంలో ఎగువ నుంచి వస్తున్నా భారీ వరద నీటిని 10 గేట్లు ఎత్తి కిందికి వాదులుతున్నారు. ( 50 కిలోమీటర్లు ప్రయాణం..)

మాములుగా అయితే 160 మెగావాట్ల ఉత్పత్తి చేసే ఈ సమయంలో బాగా కష్టపడి 220 మెగావాట్ల ఉత్పత్తి చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా ప్లాంటు 15 రోజులు నిర్విరామంగా పనిచేసింది. సామర్ధ్యానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేసే క్రమంలో ప్యానెల్ బోర్డులు వేడెక్కి, షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడానికి కారణమైనట్టు తెలుస్తుంది. అందులో పూర్తీ స్థాయి భద్రత ప్రమాణాలు వున్నాయని , మునుపెన్నడూ ఇటువంటి ప్రమాదాలు జరగలేదని అక్కడి మాజీ ఉద్యోగులు చెబుతున్నారు.

Leave a Comment