శ్రీ క్రిష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి వేషాదారణలో తమ పిల్లలను అలంకరించి చూసి
మురిసిపోవాలని ప్రతి తల్లిదండ్రుల కోరిక. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఏటా
15 రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తూ ఉండేది.ఈ కోవిడ్ 19 కారణంగా కృష్ణాష్టమి వేడుకలను ఆయా సంస్థలు, యాదవ సంఘాలు రద్దుచేయడంతో శ్రీ కృష్ణ వేషాదారణ పోటీలు ఎక్కడా నిర్వహించడం లేదు. కనుక తమ పిల్లలను కనీసం శ్రీ కృష్ణుడి వేషాధారణలో ఫోటోలతోనైనా చూసి మురిసి పోదామని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడి వేషదారణ వేసి స్టూడియోల్లో ఫోటోలు తీయించుకుంటున్నారు. దీంతో ఫోటో స్టూడియోల్లో శ్రీ కృష్ణుడి వేషాదారణలతో పిల్లలు సందడి చేస్తున్నారు. ( వారిద్దరూ అక్కాచెల్లెళ్లుగా..)
గ్రేటర్ హైదరాబాద్ జాంబాగ్ యాదవ సంఘం భవనంలో ప్రతిఏటా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలను రద్దు చేసినట్లు యాదవ సంఘం చైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్ తెలిపారు.
కోవిడ్ 19 కారణంగా ఈనెల 11వ తేదీన మంగళవారం కృష్ణాష్టమి పూజలను సాంప్రదాయ బద్దంగా యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ( సెప్టెంబర్ 1 నుండి)
భక్తులు ఎవరూ రావద్దని,వారి ఇళ్లలోనే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …