ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమం..

  • ఆసుపత్రి బులెటిన్‌ విడుదల

కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించింది. ఈ మేరకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి మెడికల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరక్టర్‌ అనురాధ భాస్కరన్‌ సోమవారం బులెటిన్‌ విడుదల చేశారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలు పరిస్థితి విషమించడంతో బ్రిటన్‌ ప్రధానికి చికిత్స అందించి కోలుకునేలా చేసిన లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రి వైద్య నిపుణుల నుంచి ఎంజీఎం వైద్యులు సలహాలు స్వీకరిస్తున్నారు.

నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్‌

Charan

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ సోమవారం ఒక వీడియోను విడుదల చేశారు. ‘అందరి ప్రార్థనలు ఫలిస్తాయి, నాన్న ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తరు’ అని అన్నారు.

Leave a Comment