Sonu Sood as mumbai mayor candidate | కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీ ..!

Sonu Sood as mumbai mayor candidate | సినీ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కరోనా వేవ్ మొదలైనప్పటి నుండి హీరో సోనూసూద్ పేరు దేశమంతటా మారుమోగుతోంది. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎనలేనివి. అందుకే ఇప్పుడు అంతా సోనూసూద్ ని రియల్ హీరో అని కొనియాడుతున్నారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లిస్ట్లో సోనూసూద్ పేరు ఉండడం విశేషం.

అసలు సంగతేంటంటే వచ్చే ఏడాది జరగబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ముంబై కాంగ్రెస్ కొత్త వ్యూహాలను తెరమీదకు తీస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను.. ముఖ్యంగా యువతకు దగ్గరగా వుండే వ్యక్తులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీకి పెద్ద మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే స్ట్రాటజీ డాక్యుమెంట్లు సిద్ధం చేసిన ముంబై కాంగ్రెస్.. అందులో ముగ్గురు సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించడం విశేషం. అలాంటి వ్యక్తులను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ తనయుడు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్, హీరో సోనూసూద్, మరో హీరో మిలింద్ సోమన్ పేర్లను ముంబై కాంగ్రెస్ రూపొందించిన స్ట్రాటజీ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. ఇలాంటి వ్యక్తులను మేయర్ అభ్యర్డులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 25 పేజీల ఈ స్ట్రాటజీ డాక్యుమెంట్ ను ముంబై కాంగ్రెస్ సెక్రటరీ గణేష్ యాదవ్ రూపొందించారు. ఈ డ్రాఫ్ట్ ను పార్టీ నేతలు పరిశీలించాల్సి ఉంది. ఇక మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర AICC సెక్రటరీ ఇంచార్జి హెచ్ కే పాటిల్ కు ఈ డ్రాఫ్ట్ సమర్పిస్తారని తెలుస్తోంది.

Heros
రితేష్ దేశ్ముఖ్ – సోనూసూద్ – మిలింద్ సోమన్

ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం.. రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని అందుకు ఎంపిక చేయడం.. డ్రాఫ్ట్ లో ఈ రెండు విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నట్లు తెలిపారు. యువతలో మంచి ఆదరణ ఉన్న వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని పేర్కొన్నట్లు చెప్పారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని టికెట్లు యంగ్ ప్రొఫెషనల్స్, సామాజిక కార్యకర్తలు, స్టార్టుప్ ఓనర్స్ కు ఇస్తే బాగుంటుందని.. పార్టీ ప్రతిష్ట పేరుగుతుందని సూచించామన్నారు. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయడమే లేక ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడమా అనేది తేల్చాలని కోరినట్లు చెప్పారు.

ఇక బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన ఆధిపత్యమే నడుస్తోంది. 1997 నుంచి 2012 వరకు బిజెపితో కలిసే బీఎంసీ ఎన్నికలలో గెలిచింది శివసేన. 2017 లో ఒంటరిగానే పోటీ చేసి మేయర్ స్థానం దక్కించుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈసారి శివసేన, కాంగ్రెసు, ఎన్ సీపీ లతో కలిసి బీఎంసీలో పోటీ చేస్తుందా లేదా.. ఎవరి దారి వారిదేనా లేదా అనేది వేచి చూడాలి. దీనిపై త్వరగా తేల్చుకుని బీఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

తాజాగా ముంబై కాంగ్రెస్ సిద్ధం చేసిన స్ట్రాటజీ డ్రాఫ్ట్ లో, ఒకవేళ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు లేని చోట త్వరగా అభ్యర్థలను తేల్చాలని కోరారు. అయితే హీరో రితేష్ దేశ్ముఖ్, హీరో సోనూసూద్, మరో హీరో మిలింద్ సోమన్ పేర్లను డ్రాఫ్ట్ లో ప్రస్తావించిన నేపథ్యంలో ఆ సెలబ్రిటీలను రాజకీయాల్లోకి తీసుకురావడం సాధ్యమేనా.. అందుకు వారు అంగీకరిస్తారా అనే చర్చ జరుగుతోంది.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today

1 thought on “Sonu Sood as mumbai mayor candidate | కాంగ్రెస్ పార్టీ కొత్త స్ట్రాటజీ ..!”

Leave a Comment