ఇప్పటికైతే సోనియమ్మనే..

Sonia AICC

సోనియా గాంధీనే మరికొంత కాలం పాటు ఏఐసిసి అధ్యక్షురాలిగా కొనసాగనుంది. గత కొంత కాలంగా ఎంతో చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం పార్టీకి, పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ( సిడబ్ల్యూసి సమావేశం ముందు )

నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలనే విషయమై సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మరి కొంత కాలం సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కమిటీ సూచించింది. తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పిచాలని సోనియా గాంధీ కోరినా ,మరో దారి లేక చివరికి తననే మళ్ళీ ఎన్నుకున్నారు.

Leave a Comment