ఏపీ బిజేపి లో స్లీపర్ సెల్స్ ఉన్నారా..!!

Somuveeraju

ఏపీ బిజేపి లో స్లీపర్ సెల్స్ : ఏపీ బిజేపికి కొత్త రధసారధి వచ్చాక పార్టీ లో ప్రక్షాళన జరుగుతోంది. ఇంత కాలం బిజేపిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో టిడిపి పెత్తనం నడిచిందని, ఇకపై ఆలా జరగదని బిజేపి అధిష్టానం తెగేసి చెప్తోంది.ఇంతకుముందు టిడిపి ప్రభుత్వంతో బిజెపి కలిసి వున్నపుడే సోము వీర్రాజు అంతెత్తున లెగిసేవాడు.

ఇప్పుడు అతనికే పార్టీ అధ్యక్ష పదివి ఇవ్వటం వల్ల మార్పు మొదలు అయిందన్న సంకేతాన్ని బిజేపి అధిష్టానం సూచిస్తోంది. టిడిపికి అనుకూలంగా వుండే సీనియర్ రాజకీయ నాయకులను తన నుండి దూరం చేయడంతోనే మార్పు మొదలు పెట్టినట్లు చెప్తున్నారు. అయినా కూడా టిడిపి బిజేపిపై పెత్తనం చెలాయిస్తోందన్నవార్తా వినిపిస్తోంది. ( AP BJP SOCIAL MEIDA)

Shade

టీడీపీలోని కీలక నేతలు బీజేపీలో చేరడం ఒక ప్రణాళికలో భాగమే అన్న వాదన ఎప్పటినుంచో బలంగా వుంది. నరనరాన టిడిపి రక్తం ప్రవహించే నేతలు బీజేపీలో చేరడమేంటని అప్పట్లో అందరిలో కలిగింది. దానికి తగ్గట్టుగానే బిజెపిలో చేరిన సుజనా చౌదరి , లంక దినకర్ వంటి నేతలు టిడిపికి అనుకూలంగా వ్యవహరించేవారు. మొన్నటి వరకు బిజెపి అధ్యక్షుడిగా వున్నా కన్నా లక్ష్మి నారాయణను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు. ఆ క్రమంలోనే అమరావతి రాజధాని విషయంలో తమను సంప్రదించకుండా గవర్నర్ కు లేఖ రాయడంతో బిజెపి హైకమాండ్ ఆగ్రహించింది. అప్పుడే టిడిపికి చెక్ పెట్టేందుకు కన్నా స్థానంలో సోము వీర్రాజును నియమించినట్లు తెలుస్తుంది. ( బీజేపీ టార్గెట్ టీడీపీనే.. ఎందుకు.!! )

2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాడాలని అంచనా వేస్తుంది. పార్టీ లో ఏ ఒక్కరు కూడా బిజెపి అధినాయకత్వానికి ఎదురు చెప్పకుండా ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి కఠిన నిర్ణయాలను అయినా తీసుకునే స్వేచ్ఛను సోము వీర్రాజుకి అధిష్టానం ఇచ్చింది. పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేసేలా ఆదేశించింది కూడా. న్యూస్ డిబేట్ లకు వెళ్లే నాయకులకు పార్టీ వైఖరి స్పష్టంగా తెలియజేయమని సూచించింది. రాజధాని విషయం కూడా రాష్ట్ర పరిధిలోని అంశమని ,అందులో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోదని మొదటినుండి చెప్తూ వస్తోంది. ఈ విషయంలో అమరావతి రైతులకు తమ పార్టీ అండగా నిలవలేక పోయిందని కొందరు బిజెపి నేతలు టిడిపికి అనుకూలంగా వ్యవహరించారు. అందుకు పార్టీ వారిని సస్పెండ్ కూడా చేసింది. ఎవరు కూడా పార్టీకి నష్టం కలిగించిన తమ వైఖరి ఇలాగె ఉంటుందని అధిష్టానం తెలియజేసింది. ఇలా సస్పెండ్ అయిన వారికోసం టిడిపి ఒక వేదిక ఏర్పాటు చేసినట్టు సమాచారం.

Leave a Comment