కరోనా లాక్ డౌన్ కారణంగా మర్చి నెల నుండి దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఉన్నాయి.
కొన్ని యూనివర్సిటీలు పరీక్షలను కూడా రద్దు చేశాయి. మరికొన్ని సంస్థలు కేంద్రం అనుమతికోసం ఎదురుచూస్తున్నాయి.
ఈ విద్య సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.
ఇప్పటివరకు కరోనాను పర్యవేక్షించిన కేంద్రం పాఠశాలలను తిరిగి సెప్టెంబర్ నెల నుండి ప్రారంభించడానికి సిద్ధమైంది.
సెప్టెంబర్ 1 నుండి నవంబర్ 14 వరకు దశల వారీగా అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
కరోనా కేసుల పరిశీలనతో పాటు, పాఠశాలల నిర్వహణ , పిల్లల తల్లితండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
అయితే స్కూల్ సిబ్బంది షిఫ్టుల వారీగా భోదించాలని, తరగతిలో విద్యార్థులు 2-3 గంటలు మాత్రమే ఉండేలా , మొదటి షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు,
అలాగే రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు నిర్వహించాలని సూచించింది. తర్వాత అన్ని రూమ్స్ ని శానిటైస్ చేయాలనీ , లేని పక్షంలో కఠిన చర్యలు వుంటాయని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఒకపక్క దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఇప్పటికే 20లక్షల 80 వేలు దాటాయి. గత 24గంటల్లో 60,537 కేసులు నమోదు కాగా 933 మంది మరణించారు.
ఈ క్రమంలో కేంద్రం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.