వారిద్దరూ అక్కాచెల్లెళ్లుగా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లు సమంత, రష్మికలు.
ఇప్పుడు సినిమా అభిమానుల దృష్టంతా వీరిపైనే. కుర్రకారుకు వీరు అభిమాన తారలు. అయితే, వీరిద్దరూ అక్కా చెల్లెళ్లన్న విషయం మీకు తెలుసా..? ఏమిటీ.. సమంత, రష్మికలు అక్కా చెల్లెళ్లా..? ఈ విషయం ఇంతవరకు తెలియలేదే అని నోరు వెళ్లబెట్టకండి.

వారిద్దరూ అక్కా చెల్లెళ్లన్నది బయట ప్రపంచంలో కాదు. ఓ సినిమాలో వారు అక్కా చెల్లెళ్లుగా నటిస్తున్నారు అంతే.. పెళ్లి తర్వాత కమర్షియల్‌ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు సమంత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.
అందులో భాగంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కూడా ఎక్కువగా కమిట్‌ అవుతోంది. ఇప్పటికే ఈమె తమిళంలో రెండు సినిమాలకు దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలిసింది.

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక ద్విభాష చిత్రంలో నయనతారతో సమంత స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోంది.
విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్న ఈ సినిమాలో నయన్, సమంతలు నటించబోతున్నట్లుగా చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కథ నచ్చడంతో సమంత కాస్త పారితోషికం కూడా తగ్గించుకున్నట్లుగా తెలిసింది. ఇక ఈమె మరో హీరోయిన్‌తో కూడా స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం ఉందంటున్నారు.

సమంతకు ఇటీవల ఒక యంగ్‌ డైరెక్టర్‌ అక్క చెల్లెళ్ల్ల నేపథ్యంలో కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో చెల్లి పాత్రకు గాను రష్మికను ఆమె సిఫార్సు చేసిందట.
ఆ దర్శకుడు రష్మికకు కూడా ఫోన్‌ ద్వారా కథ చెప్పగా సమంతతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు ఆమె ఓకే అన్నట్లుగా తెలిసింది.
అంతా ఓకే అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం రష్మిక ‘పుష్ప’ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇక సమంత, రష్మిక కలిసి నటిస్తే ఖచ్చితంగా అది సంచలనమే అవుతుందంటున్నారు సినీ ప్రేక్షకులు.

Leave a Comment