సైరా పంచ్ లకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు & కో ..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సైరా పంచ్ లతో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును, మాజీమంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏకిపారేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నేతన్నల దుస్థితి తలచుకుంటే మనసు కలిచివేస్తోంది అంటూ చేసిన వ్యాఖ్యలకు సైరా పంచ్ వేశారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా చంద్రబాబును వదలకుండా విమర్శలు చేసే విజయసాయిరెడ్డి.. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు ఏ రకమైన విమర్శలు చేసినా అన్నిటికీ సమాధానం చెబుతూ విజయసాయిరెడ్డి తన మార్కు సంచలనాలకు తెర తీస్తున్నారు. నేతన్నల దుస్థితికి కారణమైన నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఏమనిపిస్తుంది బాబు అంటూ ప్రశ్నించిన విజయసాయిరెడ్డి.. రాష్ట్రంలో నేతన్నల దయనీయమైన పరిస్థితులు చంద్రబాబు పాలనలోనే ఉండవని పేర్కొన్నారు. ( స్పీడ్ పెంచిన వైసీపీ ఎంపీలు )

ఇప్పుడు చంద్రబాబు టిడిపి హయాంలో నేతలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ప్రతి సంవత్సరం 50 వేల రూపాయల వరకు రాయితీలు ఇచ్చామని, వైసిపి హయాంలో అవన్నీ రద్దు చేసి 24000 లకు రాయితీలను కుదించి నేతన్నల బ్రతుకులను చీకట్లో పెట్టారని.. ప్రస్తుతం నేతన్నల దుస్థితి చూస్తే తన మనస్సు ఆవేదనకు గురి అవుతోంది అని సోషల్ మీడియా వేదికగా కొత్త నాటకానికి తెరతీశారు. ( చంద్రబాబు మరో స్కెచ్ )

ఇక దీనికి కౌంటర్ గా విజయసాయిరెడ్డి సైరా పంచ్ చేశారు. చంద్రబాబే నేతన్నల దుస్థితికి కారణమంటూ రివెర్స్ ఎటాక్ చేశారు. ఇదే సమయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో చేనేత రంగ పరిరక్షణకు, నేతన్నల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని జగన్ సర్కారుకు కితాబిచ్చారు. అదేవిధంగా అద్భుతమైన కళా నైపుణ్యంతో ఘనత తెచ్చిన మన చేనేత కళాకారులకు విజయసాయిరెడ్డి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా మనం కూడా చేనేత వస్త్రాలను ఆదరించి నేతన్నలకు చేయూతనిద్దాం అంటూ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

అంతేకాదు సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ ను, చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి.. “దేనికీ పనికి రాడని చదువు చెప్పిన టీచర్ పెదవి విరిచినా.. లోకేశాన్ని మంత్రిని చేసి చేసి జనం నెత్తిన పెట్టాడు బాబు” అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “ఒక్క ఓటు పడకుండానే 200 మెట్లు ఎక్కించాడు” అంటూ విమర్శించారు. “మంగళగిరి పరాభవం తర్వాత కూడా బుద్ధి వికసించలేదు” అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “రానురాను నోరు మోరి అయిందని, ఎల్లో ఫంగస్ సోకిందేమో చిట్టి నాయుడు లోకేష్ కి” అని టార్గెట్ చేసి విమర్శించారు.

అంతేకాదు ఆర్థిక నిర్వహణలో వరెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా అపకీర్తి మూటగట్టుకున్న యనమల ఖజానా లోటు గురించి మాట్లాడటం చండాలంగా ఉంది అంటూ యనమల రామకృష్ణుడును టార్గెట్ చేసారు విజయసాయిరెడ్డి. పరిమితికి మించి అప్పులు చేసామని.. ఇకపై రుణం కూడా పుట్టదని నిస్సిగ్గుగా చెప్పింది ఆయనేనని విమర్శించారు. అంతే కాదు 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్ళిన చరిత్ర మరిస్తే ఎలా అంటూ యనమల రామకృష్ణుడును ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

1 thought on “సైరా పంచ్ లకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు & కో ..!”

Leave a Comment