అల్లు అర్జున్ మూవీలో సాయి పల్లవి ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందనల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం పోస్టర్ విడుదల అయినప్పటి నుంచి అభిమానులు ఎంతగానో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా ఒక కీలక పాత్ర పోషించనుంది అని తెలుస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలు పాత్ర పోషించడానికి డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవిని సంప్రదించగా , తానూ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అదీ నిజమైతే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి చెల్లెలిగా సాయి పల్లవి కనిపించనున్నది. ( ఇంతకీ కీర్తి సురేష్ ఉన్నట్లా.. లేనట్లా.. !! )

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కొత్త లుక్ లో కనిపించనుండగా, రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించనుంది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ థ్రిల్లర్ డ్రామా చిత్రంలో బన్నీ రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించనున్నట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఓ పెద్ద ట్విస్ట్ అభిమానుల అంచనాలను మరింత పెంచుతోందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య సరసన ‘లవ్ స్టోరీ’ సినిమాలో చేస్తూ, అలాగే రానా దగ్గుబాటికి జోడిగా ‘విరాట పర్వం’ సినిమాలో నటించనుంది.

Leave a Comment