కరోనా వైరస్ కారణంగా మన దేశం మొత్తం లోక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. రవాణా శాఖా స్తంభించి పోయింది. అన్ని రాష్ట్రాలతో సహా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ సిటీలో కూడా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. మార్చి నుంచి ఇప్పటి వరకు బస్సులన్నీ డిపోలకే పరిమిత మయ్యాయి. తరువాత కేసుల సంఖ్య కొంత మేర తగ్గినట్టు భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా రవాణాకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో రాజధాని నుంచి జిల్లాలకు సర్వీసులను గతంలో ప్రారంభించింది.
అయితే కరోనా విజృంభణ అదుపులోకి రాకపోవడంతో సిటీ బస్సులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ పరిధిలో గతవారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మరియు కోలుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరగటంతో ఆర్టీసీ సర్వీసులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలో శుక్రవారం నుంచి 25 శాతం బస్సులు నడిపేందులు సీఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఆటో,క్యాబ్ లలో ప్రయాణించి జేబులు ఖాళీ చేసుకున్న పట్టన ప్రజలకు ఈ ఆర్టీసీ బస్సులు నడవడం కొంత ఊరటనిచ్చే అంశమే.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …