అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తుని రైలు ఘటన మరియు రాజధాని భూములు తగులబెట్టించిన సంఘటన చంద్రబాబుగారిదే అని ఆమె ఆరోపించారు.
అధికారంలో వున్నపుడు రాష్ట్రానికి సీబీఐ రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సీబీఐ విచారణ కోరుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ సీబీఐ విచారణకు ఆదేశించారని ఆమె అన్నారు.
ఈరోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం జగన్ తన హామీలను నెరవేరుస్తున్నారని ,తండ్రి రాజశేఖరరెడ్డి గారికంటే నాలుగడుగులు ముందుకు వేస్తున్నారని ఆమె అన్నారు.
జగన్ మహిళల పక్షపాతి అని అందుకే వైస్సార్ ఆసరా పధకం ద్వారా 90 లక్షల మందికి మేలు జరిగిందని , ఆర్ధిక ఇబ్బందులు ఉన్నపటికీ అన్ని పధకాలు అమలు చేస్తున్నారని రోజా అన్నారు.
మహిళలకు ఇచ్చే ఇళ్ల పాట్టాలు కూడా టీడీపీ అడ్డుకుందాని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగా కుంటి సాకులు చెప్పడం జగన్ కు తెలియదని ,అందుకే విద్యార్థులు ,మహిళలకు అన్ని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు అని ఆమె అన్నారు. ( పార్టీని నడిపించడం ఇలాగైతే ఎలా )
నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించి , అందులో భాగంగా దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగన్ కే దక్కిందని ఆమె కొనియాడారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …