సుశాంత్ కేసులో రియా అరెస్ట్ ..!

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ఎన్ సి బి అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ అంశం కీలకం కావడంతో ఆ దిశగా విచారణ చేపట్టిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ( ఎన్ సి బి ), రియాకు డ్రగ్ మాఫియాతో సంభందాలు ఉన్నట్లు గుర్తించారు. ( బాలీవుడ్ పై కన్నేసిన )

ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ సి బి, మూడు రోజుల విచారణ అనంతరం తాజాగా రియాను కూడా అరెస్ట్ చేసారు. డ్రగ్స్ డీలర్ తో తనకు వున్న పరిచయంతో సుశాంత్ కు డ్రగ్స్ అందజేసినట్లు రియా అంగీకరించింది. ఈ విచారణలో డ్రగ్స్ కు సంభందించి మరికొంత మంది బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తుంది. అదే నిజమైతే వారుకూడా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుండి. ఇంకా ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరిగితే మరిన్ని విషయాలు వేలాగులోకి వస్తాయో చూడాలి.

Leave a Comment