హైదరాబాద్‌లోని రైస్ ఎటిఎం, (Rice ATM) 12,000 మందికి ఉచిత సాయం.

హైదరాబాద్‌లో MBA గ్రాడ్యుయేట్ ‘రైస్ ఎటిఎం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో అతను అవసరమైన వారికి ఆహార ధాన్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తాడు.

రాము దోసపాటి అనే అతను మార్చిలో లాక్డౌన్ విధించినప్పటి నుండి ప్రజలకు అవసరమైన ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తున్నాడు. దీని వలన 12,000 మంది వరకు ప్రజలు లబ్ది పొందినట్టు చెబుతున్నాడు. ( లింక్డ్ఇన్ నుంచి కొత్త ఫీచర్స్ .. )

ఈ బియ్యం ఎటిఎం ఎల్‌బి నగర్‌లో ఉంది. బియ్యం లేని వారు ఎవరైనా ఐదు రోజుల పాటు సరిపోయే ఆహార ధాన్యాన్ని పొందవచ్చు అని రాము చెప్పారు.
“ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని నేను నమ్ముతున్నాను, ఆ ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించాను. ఎవరైనా వచ్చి బియ్యం తీసుకోవచ్చు” అని రాము పేర్కొన్నారు.

COVID-19 మహమ్మారి బారిన పడిన పేద ప్రజలకు ఈ చిన్న ప్రయత్నం ఒక వరం లాంటిది. వీరిలో చాలా మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయిన వారు వున్నారు. ఇంకొందరు భారీ జీతం కోతలు విధించబడిన వారు వున్నారు. అలాంటి వారు వారి కుటుంబాన్ని పోషించడానికి డబ్బు లేదా ఆహార ధాన్యాలు చాలా అవసరం.

రాము బియ్యం కొనడానికి తన సొంత డబ్బు నుండి రూ .4 లక్షలు ఖర్చు చేశాడు. దీంతో అతను పేదల కోసం పనిచేయడం చూసిన ఇతరులు ముందుకు వచ్చి అతని కోసం మద్దతుగా నిలిచారు.

2006 లో జరిగిన ప్రమాదంలో గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. తనకు కొత్త జీవితాన్ని అందిస్తే పేదవారికి సేవ చేస్తానని ఆ సమయంలో అతను దేవుణ్ణి ప్రార్థించాడు. దానికి అనుగుణంగా ఈ సేవా కార్యక్రమం ప్రారంభించాడు.

అప్పటి నుండి మంచి ఇలా ప్రజలకు సహాయం చేస్తున్నారు.

Leave a Comment