భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల మార్కెట్లలో ఒకటి పేటీఎం .
పాలసీ ఉల్లంఘన ఆరోపణలపై గూగుల్ ప్లే స్టోర్ ప్లాట్‌ఫాం నుంచి డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంను తొలగించిన తర్వాత మళ్ళీ అదేరోజు శుక్రవారం దాదాపు ఐదు గంటల తరువాత గూగుల్ ప్లే స్టోర్‌కు తిరిగి వచ్చింది.
పేటీఎంను తిరిగి అదే ప్లాట్‌ఫాంపై పునరుద్ధరించబడిందని ధృవీకరిస్తూ కంపెనీ ట్వీట్ చేసింది.
పేటీఎం యొక్క మొదటి అనువర్తన ఫాంటసీ గేమ్ గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా తీసివేయబడింది. తొలగించడానికి సరైన కారణం వెంటనే స్పష్టంగా తెలియలేదని టెక్ దిగ్గజం వారి పాలసీ విధానాలకు సంభందించిన ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రస్తావించారు.
“ఇది మళ్ళీ త్వరగా తిరిగి వస్తుంది”,”మీ డబ్బు అంతా పూర్తిగా సురక్షితం, మరియు మీరు మీ Paytm వాడకాన్ని ఆనందంగా కొనసాగించవచ్చు” అని ట్వీట్ చేసింది. ఈ సేవ త్వరలో పునరుద్ధరించబడుతుందని Paytm తన వినియోగదారులకు హామీ ఇచ్చింది.
గూగుల్ సర్వీస్, ఆండ్రాయిడ్ భద్రత మరియు గోప్యత ఉపాధ్యక్షుడు సుజాన్ ఫ్రే ఒక బ్లాగులో స్పందిస్తూ “మేము ఆన్‌లైన్ కాసినోలను మరియు స్పోర్ట్స్ బెట్టింగ్‌ను సులభతరం చేసే ఎటువంటి జూదాలకు మద్దతు ఇవ్వము” అని తెలియజేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే ఫాంటసీ క్రికెట్ కోసం పేటీఎం ఫస్ట్ గేమ్స్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఇది జరిగింది. ఎందుకంటే క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లపై పందెం వేస్తారు. ఆ డబ్బు సంపాదన ఆటగాళ్ళు వారి నిజ జీవితంలో ఎలా ప్రదర్శించారో దాన్ని బట్టి ఉంటుంది.
పాలసీ ఉల్లంఘన జరిగితే వెంటనే డెవలపర్‌కు తెలియజేస్తామని అప్పటివరకు ముందస్తు చర్యగా తొలగిస్తామని గూగుల్ తెలిపింది. ” వినియోగదారులను ప్రమాదకర యాప్స్ నుండి రక్షించడానికి మాకు కొన్ని విధానాలు ఉన్నాయి, పదేపదే ఈ విధమైన ఉల్లంఘనలు జరిగితే, మేము Google ప్లే డెవలపర్ ఖాతాల నుంచి తొలగించి మరింత తీవ్రమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. మా విధానాలు అన్ని డెవలపర్‌లకు సమానంగా వర్తించబడతాయి ” అని గూగుల్ తెలిపింది.
భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల మార్కెట్లలో ప్రధాన భూమికలో ఒకరైన విజయ్ శేఖర్ శర్మ పేటీఎంను స్థాపించారు. ఇది వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …