Redmi 9 షావోమీ నుంచి మరో కొత్త మొబైల్ రెడ్‌మీ 9 సేల్ ఇవాళ అమెజాన్‌లో జరగనుంది. దీని ధర రూ.10 వేల లోపే. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న షావోమీ, ఇటీవలే రూ.9,999 ధరకు రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ రిలీజ్ చేసింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు రెడ్‌మీ 9 మోడల్‌ను పరిచయం చేసింది. ఈ షావోమీ రెడ్‌మీ 9 ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఒకసారి తెలుసుకుందాం.
రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌లో ( 4జీబీ+128జీబీ ) ( 4జీబీ+64జీబీ ) మెమొరీతో, 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10watt ఫాస్ట్ ఛార్జింగ్, రెడ్‌మీ 9 రియర్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్లాంటి ప్రత్యేకతలతో ముందుకు వస్తుంది.
ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ12 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ మొబైల్ డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంటుంది . రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్‌ను స్పోర్టీ ఆరెంజ్, స్కై బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో దొరకనుండి.