ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారా.. అయితే ఇది చదవండి !

ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించడం ఇటీవల ఎక్కువైపోయింది. దీంతో వినియోగదారులు ఇబ్బంది చాలా పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు అధికం కావడంతో ఆర్బీఐ స్పందించింది. ఏటీఎం లలో క్యాష్ లేకపోతే సదరు బ్యాంకు పై జరిమానా విధించనున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు లేకపోవడం బ్యాంకుల తప్పే కానీ కష్టమర్లది కాదని అభిప్రాయపడింది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నూతన నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్స్ ని పాటించడంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధిస్తామని బ్యాంకులకు ఆర్బిఐ స్పష్టం చేసింది.

ఎక్కడైనా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు ఉంటే

ఆర్బీఐ నూతన రూల్ ప్రకారం ఏదైనా ఏటీఎం సెంటర్లో నెలలో 10 గంటలకు మించి డబ్బులు లేకపోతే, పది వేల రూపాయల జరిమానా విధించబడుతుంది. వైట్ లేబుల్ ఏటీఎంలలో డబ్బులు లేకపోతే వాటికి నగదు పంపిణీ చేసే బాధ్యత కలిగి ఉన్న బ్యాంకుకు జరిమానా విధిస్తామని ఆర్బిఐ స్పష్టం చేసింది. ఏటీఎంలో డబ్బులు లేకపోతే సిస్టం జనరేట్ చేసిన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. దీనిని ఏటీఎం కింద వచ్చే ఆర్బిఐ ఇష్యూ విభాగానికి పంపబడుతుంది. కొన్నిసార్లు ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేయాలని ప్రయత్నించినప్పుడు డబ్బులు రాకపోగా ఖాతా నుంచి మాత్రం డబ్బులు కట్ అవుతాయి. ఇలాంటి ఫిర్యాదులపై కూడా ఆర్బీఐ స్పందించింది.

ఇలాంటి పొరపాటు జరిగే ఏటీఎం కు సంబంధించి బ్యాంకు తరఫున నష్టపరిహారం చెల్లించడానికి ఒక నిబంధన ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు దీనికి సంబంధించి ప్రత్యేక నియమాలను రూపొందించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన లావాదేవీల్లో ఇలాంటి పొరపాట్లే జరిగితే వెంటనే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దీనికోసం కస్టమర్ ఎలాంటి ఫిర్యాదు చేయనవసరం లేదు. ఒకవేళ అలా జరగకపోతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫిర్యాదును ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. ఆ ఏడు రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకపోతే సదరు కష్టమర్ కు ప్రతిరోజూ వంద రూపాయల నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Comment