కరోనా వైరస్ కు రష్యా వ్యాక్సిన్ విడుదల..

Rashya

కరోనాపై ప్రపంచమంతా యుద్ధం చేస్తోన్న వేళ రష్యా ఓ గుడ్‌న్యూస్‌ వినిపించింది. గమ్‌ కోవిడ్‌ వ్యా వయక్తమవుతున్నాయిక్‌ లయో పేరుతో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ ఆగష్టు 11న విడుదల అయ్యింది..
ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వారంలోనే వ్యాక్సిన్‌ను నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

రష్యాలోని గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకా తయారు చేశాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న 21వ రోజుకు వైరస్‌ను అడ్డుకునేలా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని,
రెండో డోస్‌తో ఇది రెట్టింపు సామర్థ్యం సాధిస్తుందని సమాచారం.

ఇక ఈ టీకాను అడినోవైరస్‌ భాగాలతో చేసినట్లు స్పుత్నిక్‌ వార్తా సంస్థ వెల్లడించింది. జూన్‌లో 76 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని,
వారిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండు రకాల పరీక్షల్లోనూ ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రష్యా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యాక్సిన్ తయారీకి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మరోవైపు రష్యా వ్యాక్సిన్‌ విడుదల ప్రకటపై అమెరికా భిన్నంగా స్పందించింది.

వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతే రష్యా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని భావిస్తున్నామని అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. వ్యాక్సిన్ పంపినీ చేసే ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రష్యా మరోసారి ఆలోచించుకోవాలని ఫౌచీ సూచించారు.

Leave a Comment