ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా .. అక్కడ సలహాలు స్వీకరించబడవు..

ఏపీ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేసారు. రామచంద్రమూర్తి రాజీనామా చేయగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులు, వారి వేతనాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే సీపీఐ నేత రామకృష్ణ రామచంద్రమూర్తికి ఫోన్ చేసి మరీ పదవి వదిలినందుకు అభినందనలు తెలిపారు. మిగతా సలహాదారులు కూడా రామచంద్రమూర్తి లాగా పదవులు వదులుకుని బయటకు రావాలని రామకృష్ణ సలహా ఇచ్చారు.

రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మరో ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ రియాక్ట్ అయ్యారు. తాము సలహాదారులుగా పత్రికా ప్రకటనల రూపంలోనో , వీధి ప్రదర్శనల రూపంలోనో ఉండవని కౌంటర్ ఇచ్చారు. రామకృష్ణ రెచ్చగొట్టి నంత మాత్రాన రెచ్చిపోయే పొంగిపోయి పదవి నుంచి విడిపోయే ఉద్దేశం లేదు అన్నది వారి మాటల్లో అర్థమవుతోంది. సలహాదారుల పక్షాన మాటల ఎదురుదాడి చేసే పాత్ర కూడా దేవులపల్లి అమర్ స్వీకరించినట్టు తెలుస్తుంది.

పదవి ఒక అలంకారమే

ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం 33 మంది సలహాదారులు ఉన్నారు అన్నది ఒక లెక్క. వారిలో పదిమందికి క్యాబినెట్ హోదా కూడా ఉంది. వీరు నెలకు మూడున్నర లక్షల రూపాయలకు పైనే జీతము పొందుతున్నారు. రామచంద్ర మూర్తి నెల జీతం 382000 రూపాయలతో పాటు క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ రామచంద్రమూర్తి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న దానిపై చర్చ జరుగుతోంది. జగన్మోహన్రెడ్డి గారు ఈ 33 మంది సలహాదారులకు పదవులు ఇచ్చి, వారందరి నుంచి సలహాలు తీసుకుని పాలన సాగించాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ( ఆ కులమే .. టిడిపిని కాపాడుతుందా.. !! )

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్నారు కాబట్టి వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా పదవులు ఇచ్చారు. ఈ విషయం అందరికీ తెలుసు. స్పష్టత ఉన్న వారు నెలకు మూడున్నర లక్షలు జీతం అకౌంట్లో పడుతుండా , మన పని మనం చూసుకున్నామా అన్నట్లు గడిపేస్తున్నారు.కొందరు ప్రభుత్వ సలహాదారు పేరు చూసుకుని మురిసిపోతూ కాలం గడిపేస్తున్నారు. కానీ కొందరు మాత్రం పూర్తి శక్తిసామర్థ్యాలు, ప్రతిభ ఆధారంగా ఆ పదవిని దక్కించుకున్న వారు ఉన్నారు. వారిని జగన్మోహన్రెడ్డి అంత ఈజీగా వదులుకోరు అన్నది వాస్తవం. అలాంటి సలహాదారుల సలహాలకు గుర్తింపు కూడా ఉండొచ్చు.

ఖమ్మం జిల్లాకి చెందిన వాడని తెలిసి కూడా జగన్మోహన్రెడ్డి నియమించుకున్నారు అంటే తనపై ఎంతో నమ్మకం ఉంచి ఆ పని చేసి ఉంటారని, తన సలహాలను ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని ఊహించుకొని ఉండవచ్చు. అందుకు తగ్గట్టుగానే పనితీరు ప్రదర్శించాలని ఆయన కూడా భావించి ఉండవచ్చు కానీ అక్కడ అంత అవకాశం ఉండదు అన్నది గ్రహించలేకపోయాడు. అందుకే రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేసి తిరిగి మళ్ళీ మీడియా ప్రపంచానికి వెళుతున్నారు అని తెలుస్తుంది.

ఇలా ఎవరైనా సలహాదారుగా చేరాలనుకునే వారు గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరి సలహాలతోనో ప్రభుత్వం నడుపబడే సందర్భాలు అక్కడ వుండవు . జగన్మోహన్రెడ్డి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అందుకే కొందరు ప్రతిపక్షంలో ఉన్నపుడు చాల ఇబ్బంది పడ్డాం కనుక ఇప్పుడు కనీసం ఈ పదవి అయినా దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment