తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..

ఏపీ, తెలంగాణల్లో రేపటినుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు వాయవ్య బంగాళాఖాతంలో మరోఅల్పపీడనం ఏర్పనున్నట్టు తెలిపింది.

Heavy rains 1

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే వర్షం ఏపీలోనే ఎక్కువగా పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సోం రాష్ట్రాల్లో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.

Leave a Comment