గత పది పదిహేను రోజుల నుంచి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తూవుంది. ఇది వరకు వర్షపాతంతో పోలిస్తే సాధారణం కంటే అధికంగా నమోదు అయినట్టు వాతావరణ శాఖా చెప్తుంది. ఇదే కాకుండా తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖా పేర్కొంది.
దీని తీవ్రత మరో వారం పాటూ తెలంగాణా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సాధారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటలకు నీటి అవసరం చాలానే ఉంటుంది. ఇది కొంత రైతులకు ఊరట కలిగించే విషయమే. కానీ వానల తీవ్రత ఎక్కువైతే పంటలు నష్టపోవాల్సి వస్తదని రైతులు ఆందోళన పడుతున్నారు.
ఈ నెలలో మొదట్లో కాస్త వర్షాలు తగ్గినట్లు కనిపించినా తర్వాత నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ మాసంలో సగటున వర్షపాతం 12 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా అది 14 సెంటీమీటర్లు గా నమోదు అయ్యింది. అంటే సాధారణం కంటే 20 శాతం ఎక్కువగానే వర్షపాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ( 2000రూ..నోట్ ప్రింటింగ్ ఆపేశారా..!! )
ఈ నెల 20 నాటికి ఈశాన్య బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనానికి తెలంగాణా మొత్తం గా వర్షాలు కురుస్తాయని , అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ , ఒడిశా తీరాల వరకు దీని ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన మెదక్,సంగారెడ్డి , సిద్ధిపేట , యాదాద్రి మరియు రంగారెడ్డి లలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, నగర వాసులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …