ప్రేమ జంటల్లో చాలా మంది ప్రతి ఒక్కరూ తమ పెళ్లి తేదీ గురించి తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉంటారు. ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈమద్యే రానా, మిహీకాల ఎంగేజ్ మెంట్ జరిగి కరోనావైరస్ కారణంగా ఈ జంట వివాహ వేడుకను ఆగస్టుకు వాయిదా వేయాల్సి వచ్చిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పెళ్లి తేదీ దగ్గర పడుతోందని, 2020 ఆగస్టు 8 న ఈ జంట ముడి పడబోతోందాని తెలుస్తుంది. .
ఇటీవల, రానా దగ్గుబాటి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ,తను ప్రేమించిన అమ్మాయిని జీవితపు భాగస్వామిగా చేసుకుంటున్నట్లు, వివాహ తేదీని అతను తేదీని ఆగస్టు 8 గా వెల్లడించాడు. మరియు ” మిహీకాను వివాహం చేసుకోవడం నా జీవితంలో ఉత్తమ సమయం. ఇది చాలా అద్భుతంగా ఉంది. ” అన్నారు.
మిహీకా బజాజ్ వృత్తిరీత్యా డిజైనర్ మరియు ఆమె సొంత ఈవెంట్ సంస్థను నడిపిస్తుంది. రానా దగ్గుబాటి సౌత్ ఇండస్ట్రీలో స్థిరపడిన స్టార్ అయినప్పటికీ, అతను ‘ది ఘాజి ఎటాక్’, ‘దమ్ మారో దమ్’, ‘బేబీ’, ‘యే జవానీ హై దీవానీ’ లో అతిధి పాత్రలతో సహా కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసాడు. తెలుగు చలన చిత్రం ‘బాహుబలి మరియు బాహుబలి 2′ లోని ‘భల్లలదేవ’ పాత్రకు ఈ నటుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
రానా తండ్రి నిర్మాత దగ్గుపాటి సురేష్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు మరియు కొద్ది మంది అతిధులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారని,ముందు జాగ్రత్తగా అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.