వాహనదారులపై మరో బాంబు.. ఆ సిర్టిఫికెట్ తప్పనిసరి.. !!

మనం ఆరోగ్యంగా బతకడానికి కావలసిన స్వచ్ఛమైన వాతావరణంలో కాలకూట విషం నింపుకుంటున్నాం. ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాలు ఒక ఎత్తయితే మనం వాడే వాహనాల నుండి వచ్చే కాలుష్యం మరొక ఎత్తు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం నిలువరించేందుకు అన్ని వాహనాలకు పొల్యూషన్ యూనిఫామ్ కంట్రోల్ (PUC) సిర్టిఫికెట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ.

దీనిలో భాగంగా మంత్రిత్వ శాఖ త్వరలో వాహనాల వివరాలతో కూడిన QR కోడ్ లను, PUC సిర్టిఫికెట్ లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ QR కోడ్ లలో వాహన యజమాని, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, పొల్యూషన్ స్టేటస్ వంటి ముఖ్యమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది.

కాగా నూతనంగా అమలుచేయనున్న ఈ చట్టంతో కాలుష్య వాహనాలను, ఉల్లంఘించిన వాహన యజమానుల పై కఠిన చర్యలు తీసుకోబోతోంది.

ప్రస్తుతం ఉన్న రవాణా వాహనాల నియమ నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి కాదు. దీంతో చాలా మంది ప్రజలు తమ వాహన పత్రాలను తీసుకోకపోవడం, తమ PUC సిర్టిఫికెట్ లేదా ఇన్సూరెన్సును పునరుద్దరించక పోవడం చేస్తున్నారు.

ఈ సమస్యలను నూతనంగా ప్రవేశపెట్టబోయే చట్టంతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. 2021 జనవరి నుంచి నిబంధనలు కఠినతరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇందుకు సంబంధించి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నవంబర్ 27న ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. PUC సిస్టం ను ఆన్లైన్లో ఉంచే ముందు సలహాలు కోరుతోంది. ఈ ప్రక్రియకు మరో రెండు నెలలపాటు సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

2021 జనవరి నుంచి కొత్త నోటిఫికేషన్ అమల్లోకి వస్తే వాహనాల PUC సిర్టిఫికెట్ పునరుద్ధరించడం తప్పనిసరి అవుతుంది. PUC సిర్టిఫికెట్ పునరుద్ధరించదానికి వాహన యజమానికి 7రోజుల వ్యవధి ఇవ్వబడుతుంది.

ఈ 7 రోజుల్లో అతను చెల్లుబాటయ్యే PUC సిర్టిఫికెట్ పొందటంలో విఫలం అయితే.. అప్పుడు అతని వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అంటే RC జప్తు చేయబడుతుంది. కొత్త వ్యవస్థలో వాహన యజమానికి సంబంధించిన సమాచారం ఆటోమేటిక్ డేటాబేస్ సర్వర్ లకు అప్లోడ్ చేయబడుతుంది.

దీంతో PUC సిర్టిఫికెట్ లేకుండా ప్రజలు తమ వాహనాలను ఉపయోగించడం కష్టతరమవుతుంది. సర్వర్ అప్డేట్ విషయంలో వాహన యజమాని వారి మొబైల్ నెంబర్లను అందించాల్సి ఉంటుంది.

దీనికి వారు వన్ టైం పాస్వర్డ్ అందుకుంటారు. వాహన యజమాని OTP అందించిన తరువాతనే PUC కేంద్రంలోని సిబ్బంది అతని ఫారం రూపొందించగలరు.

అలాగే వాహన యజమాని పొగతో కూడిన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసినట్లు తేలితే వాహనాలు మళ్లీ పరీక్షించమని కోరవచ్చు. ఈ సంవత్సరం సరిదిద్దు కోవడానికి వారికి 7 రోజుల పాటు సమయం ఇవ్వబడుతుంది. కమర్షియల్ వెహికిల్స్ కు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.

మొత్తానికి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకురానున్న ఈ సంస్కరణ పెరుగుతున్న కాలుష్యానికి ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుంది.. వాహనదారులు దీనిని ఎలా తీసుకుంటారు అనే విషయం చూడాల్సి వుంది.

Leave a Comment