జగన్ ను దగ్గర చేసుకోవాలంటే… అందుకే ఇదంతా..!

జగన్ ను దగ్గర చేసుకోవాలంటే… అందుకే ఇదంతా : ఒకప్పుడు తమను ధిక్కరిస్తున్నాడన్న కోపంతో తమ ఎంపీగా ఉన్న వైయస్ జగన్ ను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. తిరిగి దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తుందా.. అకారణంగా ఏ సీబీఐ కేసు నమోదు చేసి జగన్ను ఇబ్బంది పెట్టిందో.. అదే సిబిఐ కేసుల బూచితో తిరిగి జగన్ కు దగ్గర అవ్వాలనుకుంతుందా.. అందుకు బీజేపీనే అవకాశం ఇస్తుండా.. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో కూడిన విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న జగన్ మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందుకు స్కెచ్ గీస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

జగన్ ను ఒక సాధారణ ఎంపీగా చూడటం వల్లే

2009 ఎన్నికల్లో తొలిసారి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను వారి కంచుకోట కడపలో ఎంపీగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ మరణం తర్వాత మాత్రం ఆయన కోరుకున్న సీఎం పదవి ఇచ్చేందుకు ఇష్టపడలేదు. వాస్తవానికి అప్పటికి వైఎస్ కుమారుడు అన్న ఒకే ఒక్క కారణంతో తొలిసారి ఎంపీ అయిన జగన్ ను సీఎంని చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ( డిజిటల్ లోనే విద్యాబోధన )

జనంలో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన జగన్ ముందరి కాళ్ళకు బంధం వేయడం ద్వారా, మేము ఎంపిక చేసిన వారే సీఎం కావాలని కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నారు. అలాగే ఎంపిక చేసిన రోశయ్య పై దిక్కారం ప్రదర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి నిరాకరించడం ద్వారా కాంగ్రెస్ సీరియస్ హెచ్చరికలే చేసింది. చివరకు కాంగ్రెస్ ను వీడి వైసిపి పార్టీ తో ముందుకు వచ్చిన జగన్ పై సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపింది కాంగ్రెస్ అధిష్టానం.

అయితే సరిగ్గా పదేళ్ళ తర్వాత తాను కోరుకున్న విధంగా జగన్ సీఎం కాగా.. అదే సమయంలో కాంగ్రెస్ కు జగన్ అవసరం వచ్చింది. గతంలో తమను దిక్కరించాడన్న కోపంతో సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపినా.. జగన్ ఇప్పుడు సీఎంగా ఏపీలో దాదాపు 30 మంది ఎంపీలతో పార్లమెంట్ లో సత్తా చాటుతున్న వేళ, ఆయన్ను దువ్వేనందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందు కోసం గతంలో జగన్ కు రాజకీయంగా వ్యూహకర్తగా, ఇప్పుడు తమకు వ్యూహకర్తగా వున్న ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపుతోంది.

జగన్ ను దగ్గర చేసుకోవాలంటే

కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతు ఇవ్వాలంటే తనకు ఏం కావాలనే ప్రశ్నలను పరోక్షంగా సంధిస్తోంది. గతంలో కాంగ్రెస్ తనపై చేసిన కక్షసాధింపు ప్రయత్నాలను మన్నించాలంటూ స్వయంగా జగన్ చేసిన ప్రకటననే వాడుకుంటోంది. గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ తో జత కట్టాలని పరోక్ష సంకేతాలు పంపుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నారు. ( ఢిల్లీలో కాంగ్రెస్ )

ఇందులో భాగంగా తాజాగా తాను గెలిపించిన మమతాబెనర్జీ, స్టాలిన్ తో పాటు మిగతా పక్షాలను ఐక్యం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయన దౌత్యం ఫలించి ఇప్పటికే మమతాబెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో పాటు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా కలిశారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పీకే పలుమార్లు భేటీ అయ్యి భవిష్యత్తు రాజకీయాన్ని నిర్ణయించేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో వైయస్ జగన్ ను కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

దర్యాప్తును నియంత్రించడం సాధ్యమా

గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని వాడుకుని జగన్ పై అక్రమాస్తుల కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అవే సీబీఐ కేసులను వాడుకుంటూ జగన్ ను దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి తాము అధికారంలో లేకపోయినా, తాము అధికారంలోకి వచ్చేందుకు సాయం చేస్తే జగన్ పై సిబిఐ కేసులు తొలగించడం లేదా వీలైనంత తక్కువ ప్రభావం ఉండేలా చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో జగన్ కాంగ్రెస్ కు ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దగ్గరయ్యేందుకు మార్గం సుగమమవుతదని కాంగ్రెస్ భావం. ఎలాగో జగన్ పై సిబిఐ కేసులు తప్పించేందుకు బీజేపీ పెద్దలు సహకరించకపోతే అప్పుడు తామే ఆ హామీ ఇచ్చి జగన్ ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం పట్టొచ్చు.

ప్రస్తుతం జగన్ పై సిబిఐ కేసుల విచారణ శరవేగంగా సాగుతోంది. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ బీజేపీ మద్దతు ఉన్న వైసిపి రెబల్స్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఇబ్బంది పెడుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా జగన్ అక్రమాస్తుల కేసును కొలిక్కి తెచ్చేందుకు సిబిఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.

జగన్ ఆలోచనలేంటి

మరోవైపు తనను ఆదుకుంటుందని భావించి తాను బేషరతుగా మద్దతు ఇస్తున్న బిజెపి కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఒకవైపు ఏపీ విభజన హామీలు అమలు చేయక, ఇటు తనపై వున్న సీబీఐ కేసులను అడ్డుకోలేని బిజెపిని పార్లమెంట్ లో ఇరుకున పెట్టేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. తనపై అక్రమాస్తుల కేసుల రూపంలో సిబిఐ పంజా విసురుతున్నప్పటికీ బిజెపి పెద్దలు మిన్నకుండటం, మిగతా విషయాలలోనూ సహకారం అందించకపోవడంతో జగన్ లో అసహనం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో పీకే సూచనమేరకు భవిష్యత్తులో కాంగ్రెస్ కు దగ్గరయ్యే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ పై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని.. కానీ 2024 ఎన్నికల్లో పరిస్థితిని సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంటామని జగన్,విజయ సాయిరెడ్డి పీకే కు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా కాదని ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సీబీఐ దూకుడు పెరగడంతో పాటు గతంలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులు తప్పవని జగన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

Leave a Comment