హైదరాబాదులో జిహెచ్ఎంసి ఎన్నికలు సెగలు రేపుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పోరుపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలంతా టిఆర్ఎస్ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రకాష్ రాజ్. వైరస్ లా, దొంగల్లా నగరానికి వస్తున్న జాతీయ పార్టీల నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పు పట్టారు.
మీరు ఒక పార్టీకి అధినేత అయుండి వేరొక పార్టీని ఎందుకు భుజాలపై ఎత్తుకున్నారని విమర్శించారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తనను నిరుత్సాహానికి గురి చేసిందన్నారు.
ఆయన మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ కు ఏమైందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఆయన నిర్ణయం పట్ల నిరుత్సాహానికి గురయ్యాను. మీరు ఒక నాయకుడు. జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుకు తెలుపుతున్నారు. మీ ఓటు షేర్ ఏంటి.. బీజేపీ వోట్ షేర్ ఏంటి.. మీరు ఆయన భుజాలు ఎక్కడమేమిటి.. 2014లో ఇంద్రుడు చంద్రుడు అని మీరే మద్దతు తెలిపారు.
వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నాడా.. మీరు ఎన్ని సార్లు మారుతున్నారు. అంటే మీరు ఊసరవెల్లి అయి ఉంటారు” అని ప్రకాష్ రాజు పేర్కొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి హైదరాబాద్ను దోచుకునేందుకే బీజేపీ నేతలు వస్తున్నారని విమర్శించారు.
వీళ్లకు హిందూ ముస్లిం గొడవలు తప్ప అభివృద్ధి గురించి పట్టదని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి వంటి జాతీయ పార్టీల సిద్ధాంతాల వల్లే మన దేశం అభివృద్ధి చెందడం లేదని ప్రకాష్ రాజ్ తెలిపారు.
చివరకు తేజస్వి సూర్య లాంటివారు కూడా కేసీఆర్ ను విమర్శిస్తున్నారని.. ఇంకో వేయి జన్మలెత్తినా కెసిఆర్ స్థాయికి రాలేరని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని.. వాళ్ళే బిజెపి, కాంగ్రెస్ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్ ను ఊసరవెల్లితో పోల్చుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అతని చరిత్ర ఏంటో బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే తెలిసిపోయిందని కొట్టిపారేశారు.
ఈ మేరకు ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా నాగబాబు ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. రాజకీయాలు, నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. నిర్ణయాల వెనుక ఉద్దేశం ప్రజలకు, పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం.
ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికి మాలిన వాడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. ప్రకాష్ రాజ్ డొల్లతనం ఏమిటో బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్ లోనే అర్థమైంది. నిన్ను తొక్కి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకింకా గుర్తుంది. మీ దృష్టిలో బిజెపి తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు.. తప్పులేదు.
మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహానా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ-జనసేన విజయాన్ని ఆపలేరు. బీజేపీ నేతలను నువ్వు ఎన్ని మాటలు అన్నా నిన్ను ఏమీ అనడం లేదంటే ఆపార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువెంతో అర్థం చేసుకో.
నిర్మాతల్ని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావు. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురి చేశావో అవన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …