నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే eRUPI : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ eRUPI ని విడుదల చేశారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం eRUPI ని తీసుకొచ్చింది. eRUPI ప్రీపెయిడ్ ఈ వోచర్. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం పేమెంట్ విధానాల కంటే సులభంగా కాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా eRUPI వ్యవస్థను ప్రవేశ పెట్టారు.
eRUPI చెల్లింపులలో వోచర్లే కీలకం
eRUPI చెల్లింపులలో నగదు చెల్లింపులను QR Code లేదా SMS Srting ఓచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కి పంపిస్తారు. వీటిని ఆ లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నేడు దేశం డిజిటల్ యుగంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించుకుందని తెలిపారు. దేశంలో డిజిటల్ లావాదేవీలలో Direct Benefit Transfer ని మరింత ప్రభావవంతంగా మార్చడంలో eRUPI వోచర్లు మరింత పాత్ర పోషించబోతున్నాయని అన్నారు. టార్గెటెడ్, పారదర్శక మరియు లీకేజ్ ఫ్రీ డెలివరీ లక్ష్యంగా eRUPI పనిచేయనుందన్నారు.
ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రభుత్వేతర సంస్థ ఎవరికైనా వారి విద్యా లేదా వైద్య చికిత్సలు మద్దతు ఇవ్వాలనుకుంటే వారు నగదు ఇవ్వడానికి బదులుగా eRUPI ని ఉపయోగించారని ప్రధాని అన్నారు. విరాళంగా ఇవ్వబడిన మొత్తాన్ని చెప్పిన పనికి మాత్రమే ఉపయోగించబడేలా ఇది నిర్ధారిస్తుందని వివరించారు. ఇంతకు ముందు మన దేశంలో కొంతమంది ధనవంతులకు మాత్రమే సాంకేతికత అందుబాటులో ఉండేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. నేడు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేయడానికి సాధనంగా.. వారి పురోగతికి ఒక ఆయుధంగా చూస్తున్నామన్నారు.
సాంకేతికత ఆధారంగా
టెక్నాలజీని అవలంబించడం మరియు దాంతో కనెక్ట్ అవడంలో నేడు దేశం ముందు వరుసలో ఉందన్నారు. 21వ శతాబ్దంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నామనేది eRUPI ఒక ఉదాహరణ అని చెప్పారు. భారతదేశం 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నామని ప్రధాని అన్నారు. ఇక eRUPI అనేది డిజిటల్ పేమెంట్ మాత్రమే. దాదాపుగా ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్లు గా ఇది పనిచేస్తుంది. ( ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి )
ఎలాంటి డెబిట్ కార్డ్, మొబైల్ ఆప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకుండా eRUPI ని అంగీకరించే నిర్దేశిత కేంద్రాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. యూపీఐ ప్లాట్ ఫామ్ ఆధారంగా బ్యాంకుల ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా eRUPI ని జారీ చేస్తుంది. భాగస్వామ్య బ్యాంకులను ఏదైనా కార్పొరేట్, ప్రభుత్వ ఏజెన్సీలు సంప్రదించి నిర్దేశిత వ్యక్తి పేమెంట్స్ పర్పస్ ను తెలియజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను మొబైల్ నెంబర్ ల ద్వారా గుర్తించి eRUPI వోచర్లను బ్యాంకుల ద్వారా ఏజెన్సీలు జారీ చేస్తాయి. లబ్ధిదారుల పేరుతోనే eRUPI జారీ అవుతుంది.
ఎటువంటి అవకతవకలకు తావులేకుండా
సంక్షేమ సేవలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా eRUPI ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మాతాశిశు పౌష్టికాహార పథకం, టీబీ నిర్మూలన కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ కింద మందులు, చికిత్స అలాగే ఎరువుల సబ్సిడీ ఇతర కార్యక్రమాలకు eRUPI ద్వారానే లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఒక పేరు మీద పొందిన డబ్బుని వేరొక దానికి ఉపయోగించే విధానానికి వేటు వేయనుంది. ఉదాహరణకు రైతులకు ప్రతి ఏటా వ్యవసాయ సంబంధిత పనులకు ప్రభుత్వం పది వేల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇస్తుంది అనుకుంటే, వాటిని వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు గనుక వాడితే అవన్నీ చెల్లకుండా eRUPI నిరోధిస్తుంది. దీనికి ఒక ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అన్ని రంగాల్లో eRUPI డిజిటల్ ఈ వోచర్లను
ప్రైవేటు సెక్టార్ లలోనూ, ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్, కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల కింద కూడా eRUPI డిజిటల్ ఈ వోచర్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. డిజిటల్ కరెన్సీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంకుతో కలిసి పని చేస్తోంది. ఆ ప్రణాళికలో భాగంగానే eRUPI ని కూడా ప్రవేశపెట్టింది. అయితే ఆ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. eRUPI అనేది నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే వాడుకొనే సదుపాయం కలిగి ఉండే వ్యవస్థ. వర్చ్యువల్ మనీతో పోలిస్తే ఇది విభిన్నం. eRUPI వోచర్ పేమెంట్ బేస్డ్ సిస్టంగా ఉంటుంది. ఓచర్లను నిర్దిష్టమైన అవసరం కోసమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ( UNESCO )
మరోవైపు డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. రిజర్వ్ బ్యాంకు తో కలిసి డిజిటల్ కరెన్సీ జారీకి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతమున్న రూపాయి విలువకు సమానంగా నోట్లు కాకుండా, డిజిటల్ రూపంలో డబ్బులు విడుదల చేయాలనేది కేంద్రం ఆలోచన. తద్వారా పేపర్ రూపంలో ఉన్న డబ్బును క్రమంగా తగ్గించాలని గవర్నమెంట్ భావిస్తోంది. ప్రస్తుతం అమెరికా విద్యా వ్యవస్థలో ఈ వోచర్ల విధానం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వోచర్ల రూపంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తూ కావాల్సిన కోర్సులో చేరేందుకు సాయం చేస్తూ వస్తోంది.
4 thoughts on “నిర్దేశిత ప్రయోజనాలకు మాత్రమే eRUPI”