ఆయన చెప్పినట్టు జగన్ గురించి మోడీ అలా అన్నారా..!

జగన్ గురించి మోడీ ప్రస్తావన: కరోనా మొదలైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వాళ్లకు ఉన్నంతలో వనరులను ఉపయోగించుకుంటూనే, ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్నటువంటి ఈ పరిస్థితుల మధ్య.. దాదాపు ఎనిమిది నుంచి పది వేల కోట్ల రూపాయల వరకూ కరొనాకు సంభందించిన ఖర్చు పెట్టుకుంటూ, కరోనా తీవ్రతను అదుపు చేయడానికి, పూర్తి నియంత్రణ కోసం తన వంతు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక బలమైన వాయిస్ ఢిల్లీ వేయికగా వినిపించే ఒక బిజెపి నాయకుడు.. అంతకుమించి బలమైన ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఒక నాయకుడు మోడీ గారిని కలిసారట. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పాలన గురించి, బీజేపీ పరిస్థితి గురించి, వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు కుదుర్చుకునే అంశాల గురించి తనకు ఉన్న టైంలో ప్రస్తావించే ప్రయత్నం చేశారట.

టీడీపీతో పొత్తా.. ప్రసక్తే లేదు

ఆ ప్రయత్నంలో భాగంగా మొదలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ .. ఆయన అడ్మినిస్ట్రేషన్ పాలన గురించి మరియు ఇతర కార్యక్రమాల గురించి కొంత ఫిర్యాదు రూపంలో చేసే ప్రయత్నం చేయగా.. మధ్యలోనే మోడీ గారు కలగజేసుకుని, జగన్ గురించి మోడీ గారు ఇలా అన్నారట “ఈ కరోనా కష్టకాలంలో బాగానే కష్టపడ్డారు. వాక్సినేషన్ విషయంలో ఒక మెగా డ్రైవ్ రూపంలో తానే చొరవతీసుకుని, దానికి సంబంధించిన విషయాలను పొందుపరుస్తూ నాకూ లేఖలు రాశారు. తానూ కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలపై ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని, సానుకూల దృక్పధాన్ని మోడీ గారు వ్యక్తం చేశారట”.

దాంతో ఆ నాయకుడికి నోటా మాట రాలేదట. దాంతో జగన్ ప్రస్తావన కాసేపు పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిపే క్రమంలో మోడీగారు కాసేపు మౌనంగానే ఉన్నారట. ఆ తర్వాత ఇదే నాయకుడు వచ్చే ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి అంటూ మాట్లాడడం మొదలు పెట్టగానే మోడీ గారు మధ్యలోనే ఆపేసి నథింగ్.. అటువంటిదేమీ ఉండవు అని చెప్పి ఆ నాయకుడిని పంపించేశారట.

జగన్ గురించి మోడీ పాజిటివ్ గానే

ఇదే విషయాన్ని ఆ నాయకుడు తన సన్నిహితుల దగ్గర, తన తెలిసినటువంటి మీడియా మిత్రులు దగ్గర ప్రస్తావిస్తూ.. జగన్ మోహన్ రెడ్డి గారి మీద నరేంద్ర మోడీ గారు చాలా పాజిటివ్ గానే ఉన్నారు అంటూ చెబుతున్నారట. ఏదిఏమైనా ఒకటైతే స్పష్టంగా అర్ధమవుతోంది. కేంద్రం లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా మరొకటైనా.. ఏపీ కి సంబంధించి వారి లెక్కలు వారికి ఉంటాయి. కరెక్టుగా ఎన్నికలు వచ్చేసరికి ఎవరైతే ఏపీలో బలంగా ఉంటారో వారి వద్ద వుండే రిపోర్ట్స్ ఆధారంగా, ఆ బలమైన పార్టీ మాకు దగ్గరగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు.

ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు బలంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఈపాటికే వారి దగ్గర ఒక ప్రణాళిక వుండే ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు అంతగా ఆక్టివ్ రోల్ పోషించడం లేదని, ప్రతిపక్షాలు ఇంకా ప్రజల విశ్వసాన్ని చూరగొనలేదని తెలుసుకున్న నేపథ్యంలో వారికి ఒక లెక్క వుంది ఉంటుంది. ఏది ఏమైనా బీజేపీకి కావాల్సింది ఏమిటంటే ఏపీ లో బలంగా వుండే పార్టీ తమకు దగ్గరగా ఉండాలి అని. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు కూడా తన లెక్కలు తానూ వేసుకొని వుండేవుంటాడు. అంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు.. అప్పుడు ఎవరికి బహిరంగంగా మద్దతు ఇవ్వాలి. దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపై కూడా జగన్ కు ఒక లెక్క వుండే ఉంటుంది.

2019లో అలాచేసే బొక్కబోర్లా పడ్డ చంద్రబాబు

అదేవిధంగా చంద్రబాబు 2019 ఎన్నికలప్పుడు ఫలితాలు రాకముందే, నేషనల్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయబోయి బొక్కబోర్లా పడి .. అప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ వైపు చూడలేని పరిస్థితుల్లో .. ఈసారికి ఏమైనా తొందరపడకుండా ఎన్నికల విషయంలో తొందర పడకుండా సంయమనం పాటిస్తాడేమో అది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన జాతీయ రాజాకీలపై అంతగా దృష్టి పెట్టడం లేదు. ముందు రాష్ట్రంలో వున్న జగన్ మోహన్ రెడ్డిపై పైచేయి సాధించినప్పుడు కదా జాతీయ రాజకీయాలు మొదలెట్టేది. దీని విషంలో ఎవరి లెక్కలు వారికున్నాయి.

మామూలుగా ఎన్నికల ముందే పొత్తుపెట్టుకుని ముందుకుపోయే ఆలోచన ఎప్పుడు చంద్రబాబుది. ఎన్నికల వరకు ఎవరు బలంగా ఉంటే వారివైపు మొగ్గు చూపడం అనే లెక్క కేంద్ర బీజేపీది. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలి.. దానివల్ల ఏమైనా ఉపయోగం వుంటుందా లేదా అని లెక్కలు చూసుకోవడం జగన్ మోహన్ రెడ్డి పద్దతి. తానూ ముందుగా అయితే ఎప్పుడు పొత్తులు పెట్టుకునే ప్రయత్నం గానీ,ప్రస్తావన గానీ చేయడు. ఏది ఏమైనా ఎవరి అవసరం ఎవరికి అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

Leave a Comment