పండుగ సీజన్ కి ప్లాన్ రెడీ ..

కరోనా నేపథ్యం కాలంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా మందగించింది. దానిని మళ్ళీ గాడిలో పెట్టి అమ్మకాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయేది పండుగ సీజన్. దసరా, దీపావళి పండుగలతో మార్కెట్లు జోష్‌లో ఉంటాయి. ఇదే అదనుగా బిల్డర్లు పండుగ ఆఫర్ల కింద జీఎస్‌టీ,రిజిస్ట్రేషన్స్ మరియు కార్ల వంటివి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటనల రూపంలో ఇస్తున్నారు. ఇంకొందరు డెవలపర్లయితే వార్షిక రిటర్న్స్‌ను ముందస్తుగానే అందిస్తున్నారు. దీంతో ఎక్కువమంది వీటిపై ఆసక్తితో కొనుగోళ్లకు సిద్హమవుతున్నారు.

పూర్తీ చేసిన వాటిని ఎంచుకోండి.

పూర్తిగా నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేయడం వలన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కట్టాల్సిన పనిలేదు. అలాగే గదుల విస్తీర్ణం, వసతుల ఏర్పాట్లు అన్నీ ప్రత్యక్షంగా చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసిన వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. కాకపోతే నిర్మాణంలో ఉన్న వాటితో పోల్చుకుంటే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

అదే నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడం వలన నిర్మాణం పూర్తయ్యే వరకూ అద్దె, నెలవారి వాయిదా రెండూ చెల్లించాల్సి వస్తుంది. అదే రెడీగా ఉన్న గృహమైతే.. అద్దె చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ పెట్టుబడి కోసం రెడీగా ఉన్న గృహాలు కొనుగోలు చేస్తే గనక ఆపై నెల నుంచి అద్దె వస్తుంటుంది. ప్రతి సంవత్సరం దాని విలువ కూడా పెరుగుతుంటుంది.

Leave a Comment