పెట్రోల్, డీజిల్ డిమాండ్ లలో హెచ్చుతగ్గులు… కారణం..!

న్యూ ఢిల్లీ : మార్చి చివరిలో మన దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తరువాత నుండి తగ్గిన పెట్రోల్ అమ్మకాలు మళ్ళీ సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో భారత పెట్రోల్ అమ్మకాలు మొదటిసారిగా పెరిగాయి, దాదాపు తిరిగి కోవిడ్ -19 మునుపటి స్థాయికి తిరిగి వచ్చి ఉండవచ్చు.

ప్రాధమిక పరిశ్రమ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 1 మరియు 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు సంవత్సరానికి 2.2% పెరిగాయి, అంతకుముందు నెలతో పోలిస్తే 7% పెరిగాయి.

డీజిల్ అమ్మకాలు మాత్రం కొంత ప్రతికూలలో కొనసాగుతున్నాయి, డిమాండ్ సంవత్సరం మొత్తానికి 6% పడిపోతుంది, కానీ డిమాండ్ 2020 ఆగస్టుతో పోలిస్తే 19.3% ఎక్కువగా వుంది.

దేశవ్యాప్తంగా మార్చి 25న విధించిన లాక్డౌన్ దేశ ఆర్థిక కార్యకలాపాలను నిర్వీర్యం చేసి డిమాండ్ క్షీణించిన తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారులో పెట్రోల్ అమ్మకాలు పెరగడం ఇదే మొదటిసారి.
సెప్టెంబరు మొదటి అర్ధభాగంలో పెట్రోల్ అమ్మకాలు 9,65,000 టన్నులకు పెరిగాయి, అదే సంవత్సరం 9,45,000 టన్నులు, 2020 ఆగస్టు 1-15 మధ్యకాలంలో 9,00,000 టన్నులు అమ్మకాలు జరిగాయి.

దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనమైన డీజిల్ డిమాండ్ 2019 సెప్టెంబర్ 1-15లో 2.25 మిలియన్ టన్నుల నుండి 2.13 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది ఆగస్టు మొదటి అర్ధభాగంలో అమ్మకాలు 1.78 మిలియన్ టన్నులు అమ్మకాలు ఉండటం విశేషం.

జూన్ నుండి లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రారంభం కాగా, రాష్ట్రాల మధ్య లాక్డౌన్లు కారణంగా డిమాండ్ త్వరగా పెరగడానికి ఆటంకం కలిగించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ప్రయాణీకులు తమ వ్యక్తిగత ప్రజా రవాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందున పెట్రోల్ అమ్మకాలు పెరిగాయని అంటున్నారు.
డీజిల్ మరియు పెట్రోల్ అమ్మకాలు ఆగస్టులో వరుసగా 21% మరియు 7.4% తగ్గాయి. జెట్ ఇంధనం 1,25,000 టన్నుల అమ్మకాలు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో 60% తగ్గాయి, కానీ గత ఆగస్టులో 1,03,000 టన్నుల అమ్మకాల కంటే 15% ఎక్కువే.

వంట గ్యాస్ ఎల్‌పిజి అమ్మకాలు సంవత్సరానికి 12.5 శాతం పెరిగి 1.13 మిలియన్ టన్నులుగా కొనసాగుతున్నాయి. దీని వృద్ద రేటు నెలకు 13.5 శాతం పెరిగాయి.
కారు అమ్మకాలు ఆగస్టులో 14% పెరిగాయి, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3% పెరిగాయి.

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి) చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య మాట్లాడుతూ ఈ వారం ప్రారంభంలో డిమాండ్ పెరుగుతున్న సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు, అయితే మహమ్మారి ప్రభావం వాళ్ళ కొంత ఆలస్యమవుతుందని, సంవత్సరం ముగింపు కల్లా నెలవారీ వినియోగంతో తిరిగి పూర్వ స్థాయికి చేరుకుంటుందని అన్నారు.

పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అక్టోబర్‌లో ఇంధన డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Comment