సెప్టెంబర్ 2న టీజర్..

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అలాగే నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వచ్చిన బ్రేక్‌తో ఆగిపోవాల్సి వచ్చింది.

అంతకు ముందు వరకు మాత్రం ఈ చిత్రం నుంచి కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక సాంగ్ మాత్రమే విడుదలయ్యాయి. కానీ మధ్యలో ఎన్నో సందర్భాలు వచ్చినా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment