పాకిస్తాన్ సైనికులు అక్కడ ఏం చేస్తున్నారు..

సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు : మమ్మల్ని మించిన వాళ్లు లేరు.. ఏ విషయంలోనైనా మేమే తోపులం .. మా జోలికి వస్తే అంతే అంటూ విర్రవీగే చైనా వీరత్వం ఏమిటో లోకానికి తెలిసిపోయింది. దానిదంతా మేకపోతు గాంభీర్యమేనని.. మేడిపండు వేరుసెనని తెలిసిపోయింది. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతూ నిరంతరం కవ్విస్తున్న లిల్లిపుట్ సైన్యం అసలు బలమెంతో తేటతెల్లమైంది. మంచు కొండల్లో పోరాటం కాదు కదా కనీసం కాపు కాయాలంటే సైనికులకు ముచ్చెమటలు పడుతున్నాయి. పైకి చెప్పలేక పోయినా గాల్వన్ ఘటనలో తిన్న చావుదెబ్బ వారికి అనుక్షణం గుర్తు వస్తూనే ఉంది.

సరిహద్దుల్లో డ్యూటీ అంటేనే డ్రాగన్ మిలటరీకి ఏడుపు లంకించుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. దీంతో ఏం చేయాలో పాలుపోక చివరికి పాకిస్తాన్ శరణుజొచ్చింది జిత్తులమారి డ్రాగన్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక చైనా జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన యాభై రెండు సెకండ్ల నిడివిగల ఆ వీడియో ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. చైనా సైన్యం గీతం ఆలపిస్తున్న ఆ వీడియోలో గమనిస్తే ఒక గడ్డం వ్యక్తి కనిపిస్తాడు. మిగతా సైనికులు అందరికీ అతడు భిన్నంగా ఉన్నాడు.

అతడెవరు.. ?

పరిశీలనగా చూస్తే అతడు చైనా సైనికుడు కాదని ఇట్టే తెలిసిపోతుంది. మరి అతడు ఎవరు..? చైనా స్థానికులతో కలిసి ఏం చేస్తున్నాడు అంటే అతడు చైనా సైన్యానికి శిక్షణ ఇస్తున్నాడట. అవును మీరు విన్నది నిజమే. మంచుకొండల్లో భారత సైన్యంతో తలపడలేమని తెలుసుకున్న చైనా.. పాకిస్తాన్ సైనికుల (pakistan soldiers) నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఎందుకంటే పర్వత ప్రాంతాల్లో యుద్ధతంత్రం, కుతంత్రం పుష్కర సైన్యానికి అలవాటే కదా. అందుకే పాక్ శరణుజొచ్చింది చైనా.

మౌంటైన్ వార్ ఫేర్ లో భారత సైన్యానికి అందెవేసిన చెయ్యి. ఈ విషయంలో ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే నెంబర్ వన్. అగ్ర రాజ్యాలుగా చెప్పుకునే అమెరికా, రష్యా తో పాటుగా ఏ యూరోపియన్ కంట్రీస్ దగ్గర కూడా అమౌంట్ ట్రూప్స్ లేవు. కానీ మంచులో పోరాటం అంటే మన వాళ్ళు సింహాల్లా విరుచుకుపడతారు. శత్రువుకు చుక్కలు చూపిస్తారు. మూడు సార్లు మన చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్కి బాగా తెలుసు. మౌంటెన్ వార్ ఫేర్ లో మన సత్తా ఏంటో కార్గిల్ వారే చెబుతోంది.

1962 యుద్ధంలో స్వీయ తప్పిదాల ఓటమిపాలైనప్పటికీ మన పదాతిదళం చైనా సైన్యంను మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘటనలు కోకొల్లలు. పర్వత ప్రాంతాల్లో భారత సైన్యంను ఎదుర్కోవడం కష్టమని ఇటీవల చైనా సైనిక నిపుణులు ఒప్పుకున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ సాంకేతికత బాగా పెరిగింది.

ఇటీవల పీవోకేలోని గిల్గిట్ బలిస్తాన్ ఏరియాలో ఉన్నస్కద్దు ఎయిర్ వేస్ లో చైనా విమానం భారత రాడార్ కు చిక్కింది. సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోతుంది. దీంతో అడుగు ముందుకు వేయాలి అంటే వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి చైనాది. ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తే ముందు చెప్పినట్లుగా పర్వత ప్రాంతాల్లో పోరాటం డ్రాగన్ సైన్యానికి తలకు మించిన భారమే.

అటు టిబెట్ శరణార్థుల తో కూడిన స్పెషల్ బ్రాంకెడ్ ఫోర్స్ కూడా చైనా సైన్యాన్ని భయపెడుతోంది. SFF దళాలు ఇప్పటికే 13 కీలక పర్వత ప్రాంతాలను వశపరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్వతప్రాంత యుద్ధంలో ఇక భారత్ పై గెలవలేమని డిసైడ్ అయిన చైనా.. పాకిస్తాన్ సాయం తీసుకుంటోందట. మంచు కొండల్లో వారి టెక్నిక్స్ నేర్చుకుందట.

నిజంగానే శిక్షణ ఇస్తున్నాడా..?

ఇది అంతా బానే ఉంది. మరి పాక్ సైనికులు చైనా సైనికులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారని అదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శత్రువు దాడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలి.. పోరాడే శక్తి లేనప్పుడు ఎలా దొంగదెబ్బ తీయాలి వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారో ఏమో.. ! ఎందుకంటే మనతో జరిగిన మూడు యుద్ధాల్లో తోకముడిచిన పాక్ సైనికులు చేసింది ఇదే కదా అంటున్నారు రక్షణ నిపుణులు. పాక్ సైనికుల కంటే భారత జవాన్లను పిలిస్తే శిక్షణ ఇంకా బాగా ఇచ్చేవారు కదా అంటూ చురకలు అంటిస్తున్నారు.

Leave a Comment