కొందరు రాజకీయ నేతలకు పదవే ముఖ్యం. దానికోసం ఎక్కడికైనా వెళతారు.
ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏం ఉండదు..ఏ పార్టీ అయితేనేం తనకు పదవి దక్కితే చాలు అన్నట్టుగా ఉండడం ఇప్పుడు సాధారణం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాంటి కోవలోకే వచ్చారు ఇప్పుడు ఓ టీడీపీ నేత. టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు.
అంతకు ముందు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు.
తాజాగా గతేడాది 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా పోటీ చేసి వంగా గీత చేతిలో పరాజయం చెందారు.
వరుసగా మూడ మార్లు మూడు పార్టీల నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.
ఇంతకాలం తటస్థంగా ఉన్న ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నారు.
2022లో ఆయనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో మంతనాలు జరిగినట్టు సమాచారం.
దీంతో వ్యాపార రంగంలో ఉన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం మరోమారు వైసీపీతో జత కడుతున్నారు.
మరీ.. ఈ సారైనా ఆయన ఆశలు ఫలిస్తాయో.. పదవి అతడికి దక్కుతుందో లేదో చూడాలి మరి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …