సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించినా మున్నాళ్ల ముచ్చటగానే మిగలనున్నది.
ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరితో ముగియనున్నది. ఆ తరువాత మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్సీగా 2016 జనవరి 5న గెలుపొందారు. ఆరేళ్ల పదవీకాలం ఉన్నపటికీ , పార్టీ ఫిరాయింపు కింద అతడిని 2019 జనవరి 16న అనర్హుడిగా ప్రకటించారు. దీనితో ఆయన పదవి ఊడిపోయింది. అప్పటి నుంచి ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించకపోవడంతో సుమారు 20 నెలలకు పైగా ఖాళీగా ఉంది.
( దీని మనుగడ ప్రశ్నార్ధకం .. కారణం మానవ తప్పిదమేనా ..? )
ఇప్పుడు జరగనున్నఉపఎన్నిక ఎమ్మెల్సీ పదవీకాలం 15 నెలలు మాత్రమే. టీఆర్ఎస్ తరఫున కవిత, కాంగ్రెస్ తరఫున సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్ కర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ లోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు.
ఈ స్థానంలో మొత్తం 824 ఓటర్లు ఉండగా అందులో టీఆర్ఎస్ ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కు కలిపి 609 మంది, కాంగ్రెస్ కు 136, బీజేపీకి 79 మంది మద్ధతుదారులు ఉన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- పార్టీ నేతలకు తలనొప్పిగా మారిన టీఆర్ఎస్ విజయ గర్జన సభ.. అసలు జరుగుతుందా..?విజయ గర్జన సభకు మా భూములు ఇవ్వం అంటున్న రైతులు టీఆర్ఎస్ విజయ …