ఏపీ సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన తమిళ హీరో విశాల్.. మరి టాలీవుడ్ సంగతేంటి..?

ఆన్లైన్ టికెట్ : ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన ఇప్పటి వరకూ టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. కానీ తమిళ హీరోల నుంచి మద్దతు లభిస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వ విభాగమైన డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రైల్వే వెబ్ సైట్ తరహాలో ఒక వెబ్ సైట్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం ఎనిమిది మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఉన్న సినిమా టికెట్ల యాప్ లు, వెబ్సైట్లు కొంత గందరగోళంగా ఉన్నాయని, సాధారణ ప్రేక్షకులకు భారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. దీంతో ప్రభుత్వమే ఈ టికెట్ల విక్రయం చేయడం ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. అయితే ఇప్పటివరకూ సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే ప్రభుత్వానికి చేరేవి. ఇక టికెట్ల అమ్మకాలు ప్రభుత్వ పరిధిలోకి వెళ్లడంతో అమ్మకాలు జరిపిన వాటినుంచి ఏరోజు లేక్కలు ఆరోజునే సెటిల్ చేసి ప్రభుత్వ నిర్వహణ ఛార్జీలు మినహాయించి మిగిలిన సంబంధిత వ్యక్తులకు ఇవ్వనున్నారు.

ఫిట్నెస్ లేని వెహికల్ ఇక తుక్కుకే..!

ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ భేటీ ఉంటుందా

ఈ నిర్ణయం పైన మీడియాలో చర్చ జరుగుతున్నా.. టాలీవుడ్ లోని ప్రముఖులు ఎవరు మాత్రం స్పందించలేదు. అదే సమయంలో సమర్ధించలేదు, వ్యతిరేకించలేదు. అయితే తమిళ హీరో విశాల్ ఏపీ ప్రభుత్వం నిర్ణయం పైన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ విధానం తమిళనాడులో సైతం అమలు చేయాలని కోరారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ.. ఆ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఆన్లైన్ టికెట్ విధానం అమలు చేయాలని కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ హీరోలు స్పందించినా, తెలుగు హీరోలు స్పందించకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న చర్చసాగుతోంది. సమర్థిస్తే పరిశ్రమలో కొందరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సమర్ధించక పోతే ఈ నిర్ణయం అమలుతో జరిగే నష్టం ఏంటనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జగన్ దెబ్బకు కదిలిరానున్న సినిమా ఇండస్ట్రీ

మరో నాలుగు రోజుల్లో చిరంజీవి మరోసారి ఏపీ సీఎం జగన్ ను కలిసి అవకాశం ఉంది. ఆ సమయంలో ఇతర సమస్యలతో పాటుగా ఈ అంశంపైనా చర్చించే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ సీఎం జగన్ ఏ విషయంలోనూ వెనక్కి తగ్గే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. దీంతో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ టికెట్ ల విక్రయాల నిర్ణయం టాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని అంశంగా మారింది.

1 thought on “ఏపీ సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన తమిళ హీరో విశాల్.. మరి టాలీవుడ్ సంగతేంటి..?”

Leave a Comment