ఆన్‌లైన్‌.. విద్యకు ఒక లైఫ్‌ లైన్‌..

Webnar 2

కరోనా ఉదృతి ఎక్కువగా వున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాబోధన ఒక లైఫ్‌లైన్‌గా మారిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. కాజీపేటలోని నిట్‌లో మంగళవారం ‘ఆన్‌లైన్‌ విద్య – అవకాశాలు – సవాళ్లు’ అంశంపై జాతీయ స్థాయి వెబినార్‌ను నిర్వహించారు.

హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించిన ఈ వెబినార్‌లో గవర్నర్‌ మాట్లాడుతూ, కరోనా విజృంభన విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యాబోధన ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో విద్యాసంస్థలు మరింత కృషి చేయాలని సూచించారు.

కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఆన్‌లైన్‌ విద్యాబోధన అందించడానికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని అభినందించారు గవర్నర్‌ తమిళిసై. కోవిడ్‌కు వాక్సిన్‌ వచ్చేంత వరకు తరగతి గదుల్లో నేరుగా విద్యాబోధన సాధ్యం కాదని, ఆన్‌లైన్‌ బోధనే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. ( డిజిటల్‌ విద్య .. అమలు )

ఇంకా నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు మాట్లాడుతూ.. విజ్ఞానం, నైపుణ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో నిట్‌ ముందంజలో నిలుస్తోందని తెలిపారు. దేశంలో నిర్వహించిన సర్వేలో వరంగల్‌ నిట్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. వెబినార్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌కిషోర్, నిట్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.గోవర్దన్‌రావు, ప్రొఫెసర్లు శ్రీనివాస్, హీరాలాల్, గంగాధరన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుండి వెయ్యి మంది ఆన్‌లైన్‌ ద్వారా వెబినార్‌లో లో పాల్గొన్నారు.

Leave a Comment