డిజిటల్‌ విద్య .. అమలు సాధ్యమేనా.. !!

  • ప్రభుత్వ విద్యార్ధుల వద్ద ఉన్న పరికరాల పై ఆరా
  • అండ్రాయిడ్‌ ఫోన్లు, టీవీలు, ఇంటర్‌ నెట్‌ వివరాల సేకరణ
  • మూడు రోజుల పాటు వివరాలు సేకరించిన అధికారులు
  • దూరదర్శన్, టీశాట్‌ ద్వార తరగతుల నిర్వాహణకు కసరత్తు
Online classes

కరోనా వైరస్‌ ఈ విద్యా సంవత్సరాన్ని ఘోరంగా దెబ్బతీసింది.. విద్యార్ధులను చదువులకు దూరం చేసి ఇంటికే పరిమితం చేసింది. కరోనా కారణంగా చదువులకు ఏర్పడిన ఆటంకాన్ని అధికమించేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ బోధనా విధానానికి చర్యలు చేపట్టింది. డిజిటల్‌ పాఠాల భోదన కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.

విధ్యాశాఖ అధికారుల సర్వే

విద్యా సంవత్సరం జూన్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్‌ నేపధ్యంలో నేటికి పాఠశాలలు ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వం విద్యార్ధులకు డిజిటల్‌ పాఠాలు చెప్పేందుకు సన్నద్దం అవుతుంది. ఈనేపధ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల వద్ద ఉన్న డిజిటల్‌ పరికరాల పై విద్యాశాఖ అధికారులు ఈ నెల 16 నుండి 18 తేదీ వరకు సర్వే నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఎన్ని, ప్రాథమికోన్నత పాఠశాలలు ఎన్ని, ఉన్నత పాఠశాలలు , కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు మోడల్‌ పాఠశాలలు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టింది. ఇందులో బాల బాలికలు ఎంత మంది విద్యార్ధులు ఉన్నారు, ఎంత మంది వద్ద అండ్రాయిడ్‌ ఫోన్లు, ఇంటర్‌ నెట్, టీవీలు ఉన్నాయి, ఎంత మంది వాటిని ఉపయోగిస్తున్నారు అన్న విషయాల పై సర్వే కొనసాగింది.
ఇందులో 60 నుండి 70 శాతం మంది విద్యార్ధుల వద్ద డిజిటల్‌ పరికాలు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది.

3నుండి 10వ తరగతి విద్యార్ధులకు

కోవిడ్‌ నేపధ్యంలో విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్ధులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యామ్మాయ మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్ధులకు డిజిటల్‌ పాఠాలు భోధించేందుకు కసరత్తులు చేస్తుంది. 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు విధ్యాశాఖ జిల్లాలో సర్వే నిర్వహించారు. ఎంత మంది విద్యార్ధులు డిజిటల్‌ పాఠాలు వినగలుగుతారో తెలుసుకునేందుకు పలు అంశాల పై సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల వద్ద మొబైల్‌ అండ్రాయిడ్‌ ఫోన్లు, ఇంట్లో టీవీలు, కేబుల్, , ఇంటర్‌ నెట్‌ కనెక్షన్లు, డెస్కు టాప్, ల్యాప్‌టాప్‌లు ఎంత మంది ఉన్నాయన్న వివరాలను అధికారులు సేకరించారు.

దూరదర్శన్, టీశాట్‌ ద్వార తరగతులు

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు చదువుకు ఆటంకం కలగకుండా డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. దూరదర్శన్, టీశాట్, వాట్సాప్‌ తదితర మార్గాల ద్వార విద్యార్ధులకు భోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులకు ఆన్‌లైన్, జూమ్‌ యాప్‌ల ద్వార సబ్జెక్టు వారీగా శిక్షణలు నిర్వహించారు.

Leave a Comment