తెలంగాణలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించేలా ఉంది. కరోనా ఉదృతంగా ఉన్న కాలంలో ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
సరైన బస్సు సౌకర్యాలు లేకపోయినా ఆటోల్లో కిక్కిరిసి వెళ్తూ టీచర్లు ఎంతో పడ్డారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రతీ ఇంటికీ తిరుగుతూ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులలో పాల్గొంటున్నారో లేదా అని పరిశీలిస్తున్నారు. దీంతో అనేకమంది ఉపాధ్యాయులు కరోనా సోకడంతో పాటు కొందరు బలైపోయారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వివరాల ప్రకారం , పాఠశాలలకు వెళుతున్న టీచర్లు 16రోజుల్లోనే దాదాపు 1,450 మంది దాకా వైరస్ బారిన పడినట్టు లెక్క తేలింది. ఇది మరింత పెరిగే ప్రమాదమున్నట్టు తెలుస్తుంది.
అందుకే తమకు కూడా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం సేకరించిన వివరాల్లో కూడా టీచర్లలో కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోవడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందుకే సగంమంది సిబ్బంది హాజరైతే చాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే సిబ్బందికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని సర్కారు తీసుకుంది. ( ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కరోనా )
ఆన్‌లైన్ క్లాసుల జరుగుతున్న నేపథ్యంలో బోధనా పరమైన సిబ్బంది విషయంలో సగం మంది మాత్రమే విధులకు హాజరైతే చాలని, ఈ నెల 21 నుంచి ఈ అవకాశాన్ని కల్పిస్తూ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జీఓ జారీ చేశారు. అయితే,ఆ ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా విడుదల చేసిన మరో ఉత్తర్వుల్లో మాత్రం ఈ నెల 25వ తేదీన మాత్రం సిబ్బంది అంతా హాజరు కావాలని పేర్కొనడం విశేషం. ఏది ఏమైనా కరోనా విజృంభిస్తున్న తరుణంలో భయంతో వణికిపోతున్న ఉపాధ్యాయులకు ఇది కొంత బలాన్ని ఇచ్చినట్టయింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …