అక్టోబర్ 23న ప్రభాస్ ఫాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ..

ప్రభాస్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ చేసిన సినిమాలు ఒకసారి చుస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. గత ఏడాది సాహో సినిమా తర్వాత ఇప్పటివరకు మరో మూవీ రిలీజ్ కాకపోవడంతో తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యాం గురించిన విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. పూజా హెగ్డే హీరోయిన్ గ నటించిన ఈ మూవీ రొమాంటిక్ మోడ్ లో ఉంటుందని తెలుస్తుంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాధే శ్యాం మూవీ, తొందరలోనే సెట్స్ మీదకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ శరవేగంగా పనులు చేస్తున్నారు. ( న్యూ లుక్ తో అదరగొడుతున్న అగ్ర హీరోలు . )

పాన్ ఇండియా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అమిత్ త్రివేది మ్యూజిక్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు లీక్ అయ్యాయి. తెలుగులో ఆయన ఇప్పటికే సైరా మూవీకి సక్సెస్ కూడా ఇచ్చారు. అయితే అక్టోబర్ 23న టీజర్ రిలీజ్ చేసి ప్రభాస్ కి బర్త్డే గిఫ్టుగా ఇవ్వాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలనుండి సమాచారం. అదే జరిగితే ఫాన్స్ కి కూడా అదో పెద్ద గిఫ్ట్ అని చెప్పవచ్చు. ఇక టీజర్ రిలీజ్ కావడమే ఆలస్యం.

Leave a Comment