లీటర్ పెట్రోల్ ధర రూ. 160.. ! ఎక్కడో తెలుసా.. !!

లీటర్ పెట్రోల్ ధర రూ. 160 ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారా ? మీరు వింటున్నది నిజమే.. ఈ పెట్రోల్ ధర లీటర్ కు అక్షరాల రూ. 160. కానీ ఇది అందరూ వాడుతున్న పెట్రోల్ కాదు. స్పెషల్ క్వాలిటీ ఉన్న ఆక్టేన్ ఎక్స్ ట్రా ప్రీమియం 100. దీనికి ఉన్న ప్రత్యేకతే ఇంత ధరకు కారణం. పొల్యూషన్ ఫ్రీ మరియు వందశాతం బర్న్ అవటం వంటి లక్షణాలు ఉండే ఈ పెట్రోల్ ను వాడితే బండ్లు మంచి కండిషన్ లో ఉంటాయి. అందువల్ల స్పోర్ట్స్ బైక్స్, లగ్జరీ కార్లు వారంతా ఇప్పుడు ఆక్టేన్ 100 పెట్రోల్ ను వాడుతున్నారు.

ఈ ఆక్టేన్ ఎక్స్ ట్రా ప్రీమియం100 కథ ఏమిటి ?

మనం వాడే పెట్రోల్ లో రకరకాల క్వాలిటీలు ఉంటాయి. ఆక్టేన్ 91, 92, 95, 97, 99, 100 ఇలా చాలా క్వాలిటీలుంటాయి. సాధారణంగా మన బంకుల్లో అన్ని వెహికల్స్ లో వాడే పెట్రోల్ ఆక్టేన్ 91 దొరుకుతుంది. పవర్ పెట్రోల్ ఆక్టేన్ 92 ఇండియన్ ఆయిల్​ ఫిల్లింగ్ స్టేషన్లలో ఉంటుంది. ఆక్టేన్ 95 హిందూస్థాన్​ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్లలో ఉంటుంది. భారత్ పెట్రోలియం బంకుల్లో ఆక్టేన్ 97 పవర్ పెట్రోల్ ఉంటుంది.

ఇదివరకే హెచ్ పీ సంస్థ ఆక్టేన్ 99 ని అందుబాటులోకి తెచ్చింది. వీటన్నింటి కన్నా మరింత క్వాలిటీ అయిన పెట్రోలే ఆక్టేన్ 100. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఆక్టేన్ 100ను అందుబాటులోకి తెచ్చింది. సౌత్ ఇండియాలోనే ఈ క్వాలిటీ పెట్రోల్ ను ముందుగా మన దగ్గరే స్టార్ట్ చేయటం విశేషం.

ఇక నుండి అన్ని ప్రాంతాల్లో ..

విదేశాల్లో మాత్రమే వాడే ఈ పెట్రోల్ ను ఇప్పుడు మన దగ్గరకు అందుబాటులోకి తెచ్చారు. దేశం మొత్తంలో 31 సిటీల్లో 79 బంకుల్లో ఈ పెట్రోల్ ను అమ్ముతున్నారు. ఢిల్లీలోనే అత్యధిక ఫిల్లింగ్ స్టేషన్లు 15 ఉన్నాయి. అంతకుముందు లగ్జరీ కార్ల కోసం ఆక్టేన్ 99ను మాత్రమే వాడేవారు. ఆక్టేన్ ఎక్స్ ట్రా ప్రీమియం 100 అందుబాటులోకి వచ్చాక ఆక్టేన్ 99 సేల్స్ శాతం తగ్గిందని బంకు నిర్వాహకులు చెప్తున్నారు. ఆక్టేన్ 100 ను యూపీలోని మథాని నుంచి హైదరాబాద్ కి బుక్ చేసిన 4 రోజులకు ట్యాంకర్ ను సప్లయ్ చేస్తున్నారు. సాధారణ పెట్రోల్ వాడుతూనే ఆక్టేన్ 100 కూడా వాడొచ్చని,ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వాహకులు చెప్తున్నారు.

డిమాండ్ పెరిగింది..

ఆక్టేన్ 100 పెట్రోల్ వాడకం ఇప్పుడు బాగా పెరిగింది. లగ్జరీ కార్లు వాడే వారు ఇలాంటి పెట్రోల్ నే ఫిల్ చేయించుకుంటున్నారు. గత రెండు నెలల నుండి సిటీలో ఈ పెట్రోల్ అమ్మకాలు మొదలయ్యాయి. ఈ పెట్రోల్ ను కొట్టిస్తే ఇంజన్ స్మూత్ గా ఉండటంతో పాటు వెహికల్ కండిషన్ బాగుంటుంది. దీంతో చాలామంది బంకు దగ్గర క్యూ కడుతున్నరు.

Leave a Comment