తెలుసుకోవాలే కానీ ఈ భూమిపైన ఎన్నో వింతలు.. విశేషాలు..ఆశ్చర్యపరిచే నిజాలు. అలాంటి ఒక కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ సూర్యుడు కొంతకాలం అడుగుతాడు అన్నట్టుగా ఒకటి కాదు.. రెండు కాదు.. వారము కాదు.. ఏకంగా 66 రోజుల పైచిలుకు ప్రజలకు దర్శనమివ్వడు. దీంతో అక్కడ చీకట్లు కమ్ముకుంటాయి. కృత్రిమ దీపాలతోనే గడుపుతారు.
ఆ ప్రాంతం మరెక్కడో కాదు అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో Utqiagvik అనే నగరంలో ఈ పరిస్థితి ప్రతీ సంవత్సరం కనబడుతుంది. అలస్కా, ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి.
ఈ రాష్ట్రం భూభాగ పరంగా అన్నీ అమెరికా అన్ని రాష్ట్రాల కన్నా పెద్దది. అలస్కా భూభాగం రష్యా నుంచి అక్టోబర్ 18, 1867 న 7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం పేరే Utqiagvik. ఈ పట్టణం ఆర్కిటిక్ సర్కిల్ కు ఉత్తర భాగంలో ఉంటుంది. ఇంతకుముందు ఈ పట్టణాన్ని బారో అని పిలిచేవారు.
ఈ పట్టణంలోని ప్రజలు ఏడాదిలో రెండు నెలల పాటు చిమ్మచీకటిలో గడుపుతారు. ఈ ప్రక్రియనే పోలార్ నైట్ అని పిలుస్తారు. ఏటా శీతాకాలంలో ఇలాంటి పరిస్థితి Utqiagvik పట్టణంలో తలెత్తుతుంది. ఏటా చలికాలంలో అంటే నవంబర్ 18 లేదా 19వ తేదీన Utqiagvik పట్టణంలో సూర్యుడు అస్తమించి మరో 66 రోజులపాటు కనిపించడు. తిరిగి జనవరి 22 లేదా 23 వ తేదీన సూర్యుడు కనిపిస్తాడు.
భూమి యొక్క అంశం ఒంపు కారణంగా ఏటా శీతాకాలంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం Utqiagvik 71.29 డిగ్రీల ఉత్తర అక్షాంశం పై ఉండటమే. దీని ప్రత్యేక జియో లొకేషన్ కారణంగా సుదీర్ఘ పోలార్ నైట్ ను చూడాల్సి వస్తోంది.
శీతాకాలం సమయంలో భూమి, సూర్యుడికి దూరంగా ఒంగి ఉండటం కారణంగా పోలార్ సర్కిల్ లలో మాత్రమే ఈ పోలార్ నైట్ లు ఉంటాయి. మరి రెండు నెలల పాటు ఎండ లేకపోతే ఎలా అన్న డౌట్ అక్కర్లేదు. అక్కడి వారు ముందు జాగ్రత్తగా విటమిన్-డి సప్లిమెంట్ ను రెడీగా పెట్టుకుంటారు.
పగటిపూట కరెంటు ఎలాగూ ఉంటాయి. ఇక సూర్యుడు కనిపించడు కనుక పగటిపూట పూర్తిగా చీకటిమయం అవుతుందా అంటే.. దాదాపు చీకటిగానే ఉంటుందని అయితే కాస్త మందంగా వెలుతురు ఉంటుందని చెప్తారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వేకువజాము వెలుగు కన్నా తక్కువ వెలుగు అన్నమాట. తిరిగి సూర్యుడు జనవరి 22 లేదా 23 న కనిపించినప్పుడు ఆ సమయంలో ఆకాశం ఎలా ఉంటుంది అనే దానిపై అందరి దృష్టి ఉంటుంది.
ఇక ఉష్ణోగ్రతలు కూడా అత్యంత తక్కువగా ఉండటంతో పాటు ధృవరాత్రి ప్రభావం కూడా ఉండటంతో భూమిపైన అత్యంత మేఘవంతమైన ప్రాంతంగా Utqiagvik కు గుర్తింపు ఉంది. ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తుండటంతో Utqiagvik పట్టణంలో సంవత్సరంలో 50 శాతం కంటే కాస్త ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. ఇక్కడ క్యుములో మేఘాలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక మంచు క్రమంగా తగ్గుతున్న సమయంలో అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మేఘాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఉష్ణోగ్రతలు మైనస్ 34 డిగ్రీల సెల్సియస్కు పడిపోతే మంచుగడ్డలు ఏర్పడడం అక్కడ సర్వ సాధారణం. అయితే ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత ‘0’ డిగ్రీలుగా నమోదవుతోంది. ఈ పట్టణంలో ప్రస్తుతం 4300 మంది నివసిస్తున్నారు. అయితే ఈ అనుభూతిని మీరు పొందాలనుకుంటే Utqiagvik పట్టణానికి ఇప్పుడు వెళితే ఆ అనుభూతిని ఆస్వాదించవచ్చు.
2020 నవంబర్ 18 బుధవారం అక్కడి ప్రజలు మధ్యాహ్నం 1:30 కు చివరి సూర్యోదయాన్ని చూశారు. మళ్లీ 2021 జనవరి 23న వారికి సూర్యుడు కనిపిస్తాడు. అంటే అరవై ఆరు రోజుల తర్వాతే వారు సూర్యున్ని చూడగలరు. ఈ రెండు నెలల పాటు అక్కడ పూర్తిగా అంధకారంగా ఉంటుంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …