డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్స్ కు సమన్లు : NCB

అనుకున్నదే జరిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నలుగురు ప్రముఖ హీరోయిన్లకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్స్ సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, దీపికా పదుకునే లతో పాటు టాలీవుడ్ హెరాయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. మూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని మరియు విచారణకి సహకరించాలని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తన నోటీసుల్లో పేర్కొంది.

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణానికి డ్రగ్స్ తో సంబంధమున్న కారణంతో, తన ప్రేయసి రియాను అరెస్ట్ చేసిన అనంతరం ఇలా కొందరి ప్రముఖుల పేర్లను విచారణలో రియా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే NCB వీరికి నోటీసులు జారీ చేసింది.

Leave a Comment